ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అత్యంత కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. పోటీ చేసే అభ్యర్థుల నుంచి పోలీసులు ఇచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు(NOC) లేదా వివిధ శాఖల నుంచి పొందే నో డ్యూస్ సర్టిఫికెట్లు లేవనే నెపంతో నామినేషన్లను తిరస్కరించవద్దని ఎన్నికల అధికారులను తీవ్రంగా హెచ్చరించింది.

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సర్క్యులర్ జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలు సమర్పించే సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, అలాగే ఇతర ప్రభుత్వ శాఖల నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్లు జతచేయాలని రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల అధికారులు అభ్యర్థులపై ఒత్తిడి తెస్తున్నారని రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఎస్‌ఈసీకి పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి.
ఈ ఫిర్యాదులపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టమైన వివరణ ఇచ్చింది. స్థానిక సంస్థల చట్టాల్లో కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల్లో కానీ పోలీసులు ఇచ్చే ఎన్‌ఓసీ లేదా నో-డ్యూస్ సర్టిఫికెట్లు తప్పనిసరి అని ఎక్కడా పేర్కొనలేదు. ఈ పత్రాలు సమర్పించలేదని ఏ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించడానికి వీల్లేదని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియల్లో గతంలో కమిషన్ జారీ చేసిన నిబంధనలు, మార్గదర్శకాలను మాత్రమే కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.
జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, అదనపు ఎన్నికల అధికారులు, మున్సిపాలిటీల కమిషనర్లతోపాటుగా ఇతర అధికారులకు ఈ మేరకు ఆదేశాలు వెళ్లాయి.
స్థానిక పోరులో నామినేషన్లు వేసే సమయానికి పోలీస్ స్టేషన్ల నుంచి కేసులు లేవని నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకోవడం, లేదా విద్యుత్, పంచాయతీ, ఇతర పన్నుల బకాయిలు లేవని నో డ్యూస్ ధృవీకరణ పత్రాలు సంపాదించడం అభ్యర్థులకు పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ సర్టిఫికెట్లను అడ్డు పెట్టుకుని నామినేషన్లను తిరస్కరించే అవకాశం ఉందనే ఆందోళన అభ్యర్థుల్లో వ్యక్తమైంది. ఎస్‌ఈసీ ఇచ్చిన ఈ తాజా స్పష్టతతో పోటీలో ఉన్న అభ్యర్థులకు పెద్ద ఊరట లభించినట్లయింది.
{{/usCountry}}స్థానిక పోరులో నామినేషన్లు వేసే సమయానికి పోలీస్ స్టేషన్ల నుంచి కేసులు లేవని నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకోవడం, లేదా విద్యుత్, పంచాయతీ, ఇతర పన్నుల బకాయిలు లేవని నో డ్యూస్ ధృవీకరణ పత్రాలు సంపాదించడం అభ్యర్థులకు పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ సర్టిఫికెట్లను అడ్డు పెట్టుకుని నామినేషన్లను తిరస్కరించే అవకాశం ఉందనే ఆందోళన అభ్యర్థుల్లో వ్యక్తమైంది. ఎస్‌ఈసీ ఇచ్చిన ఈ తాజా స్పష్టతతో పోటీలో ఉన్న అభ్యర్థులకు పెద్ద ఊరట లభించినట్లయింది.
{{/usCountry}}