AP Local Elections : ఏపీ స్థానిక పోరు.. ఈ రెండు గుర్తులు ఫ్రీజ్ చేసిన ఎన్నికల సంఘం!

AP Local Body Elections : రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలపై కీలక అప్డేట్ ఇచ్చింది. రెండు గుర్తులను ఫ్రీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది.

Published on: Oct 21, 2026, 18:45:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైన వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల గుర్తుల కేటాయింపునకు సంబంధించి ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి బకెట్, పెన్ స్టాండ్ గుర్తులలో మార్పులు చేస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏ అభ్యర్థికీ ఈ రెండు గుర్తులను కేటాయించకుండా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు (Freeze) ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన పార్టీలలో జనసేన పార్టీ అధికారిక గుర్తు గాజు గ్లాస్. అయితే ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే ఫ్రీ సింబల్స్ జాబితాలోని బకెట్, పెన్ స్టాండ్ గుర్తులు చూడటానికి దూరంగా గాజు గ్లాస్ గుర్తును పోలి ఉండటంతో గతంలో అనేక చోట్ల ఓటర్లు అయోమయానికి గురైనట్లు ఫిర్యాదులు వచ్చాయి.

ఓటింగ్‌ సమయంలో ఓటర్లు ఎటువంటి గందరగోళానికిలోనుకాకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. జనసేన పార్టీ అభ్యర్థుల గుర్తులను ఈ పోలికల వల్ల నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా స్వతంత్రులకు ఇచ్చే ఉచిత గుర్తుల జాబితా నుంచి ఈ రెండింటిని ఫ్రీజ్ చేసినట్టుగా తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులకు బకెట్, పెన్ స్టాండ్ గుర్తులు కేటాయించరు.

ఏపీ స్థానిక పోరులో రచ్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆరంభంలోనే తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నామినేషన్ల స్వీకరణ తొలి రోజే పలు జిల్లాల్లో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల శ్రేణులు పరస్పరం భౌతిక దాడులకు దిగాయి. పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాలైన అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో పలుచోట్ల తోపులాటలు, రాళ్ల దాడులు చోటుచేసుకోవడంతో నామినేషన్ కేంద్రాల వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది.

పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, మాచర్ల, ముప్పాళ్ల తదితర ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు కేంద్రాలకు చేరుకుంటున్న సమయంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రధాన నియోజకవర్గాల్లోని కీలక వైసీపీ నేతలను బయటకు రాకుండా ఇళ్లలోనే నిర్బంధించారు.

రాయలసీమ ప్రాంతంలోనూ నామినేషన్ల పర్వం రణరంగంగా మారింది. అన్నమయ్య జిల్లా పుంగనూరులో టీడీపీ, వైసీపీ వర్గాలు మున్సిపల్ హైస్కూల్ సమీపంలో ముఖాముఖి తలపడ్డాయి. వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ కార్యాలయం బయట ఇరుపార్టీల కార్యకర్తలు మోహరించి దాడులకు దిగారు. ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి నోటీసులు జారీ చేశారు. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే పోలీసులు తమ నాయకులను నిర్బంధిస్తున్నారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More