ఆ సర్టిఫికెట్లు లేవని నామినేషన్లు తిరస్కరించొద్దు.. ఏపీ స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ

నామినేషన్ దాఖలుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక విషయం తెలిపింది. పోలీసుల నుండి ఎన్‍వోసీ, ప్రభుత్వ శాఖల నో డ్యూ సర్టిఫికెట్లు లేకపోయినా నామినేషన్ తిరస్కరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

Published on: Oct 21, 2026, 19:33:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అత్యంత కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. పోటీ చేసే అభ్యర్థుల నుంచి పోలీసులు ఇచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు(NOC) లేదా వివిధ శాఖల నుంచి పొందే నో డ్యూస్ సర్టిఫికెట్లు లేవనే నెపంతో నామినేషన్లను తిరస్కరించవద్దని ఎన్నికల అధికారులను తీవ్రంగా హెచ్చరించింది.

అనిల్ చంద్ర పునేఠా
అనిల్ చంద్ర పునేఠా

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సర్క్యులర్ జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలు సమర్పించే సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, అలాగే ఇతర ప్రభుత్వ శాఖల నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్లు జతచేయాలని రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల అధికారులు అభ్యర్థులపై ఒత్తిడి తెస్తున్నారని రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఎస్‌ఈసీకి పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి.

ఈ ఫిర్యాదులపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టమైన వివరణ ఇచ్చింది. స్థానిక సంస్థల చట్టాల్లో కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల్లో కానీ పోలీసులు ఇచ్చే ఎన్‌ఓసీ లేదా నో-డ్యూస్ సర్టిఫికెట్లు తప్పనిసరి అని ఎక్కడా పేర్కొనలేదు. ఈ పత్రాలు సమర్పించలేదని ఏ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించడానికి వీల్లేదని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియల్లో గతంలో కమిషన్ జారీ చేసిన నిబంధనలు, మార్గదర్శకాలను మాత్రమే కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, అదనపు ఎన్నికల అధికారులు, మున్సిపాలిటీల కమిషనర్లతోపాటుగా ఇతర అధికారులకు ఈ మేరకు ఆదేశాలు వెళ్లాయి.

స్థానిక పోరులో నామినేషన్లు వేసే సమయానికి పోలీస్ స్టేషన్ల నుంచి కేసులు లేవని నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకోవడం, లేదా విద్యుత్, పంచాయతీ, ఇతర పన్నుల బకాయిలు లేవని నో డ్యూస్ ధృవీకరణ పత్రాలు సంపాదించడం అభ్యర్థులకు పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ సర్టిఫికెట్లను అడ్డు పెట్టుకుని నామినేషన్లను తిరస్కరించే అవకాశం ఉందనే ఆందోళన అభ్యర్థుల్లో వ్యక్తమైంది. ఎస్‌ఈసీ ఇచ్చిన ఈ తాజా స్పష్టతతో పోటీలో ఉన్న అభ్యర్థులకు పెద్ద ఊరట లభించినట్లయింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More