...
...
Next Story

AP SET Result : ఈనెల 30న ఏపీ సెట్ ఫలితాలు - స్కోర్‌ కార్డు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే..?

Andhra Pradesh State Eligibility Test Result : ఏపీ సెట్ ఫలితాలను మే 30వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రకటన విడుదలైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి.. స్కోర్ కార్డును చెక్ చేసుకోవచ్చు.

Published on: May 24, 2026 04:39 PM IST
Advertisement

Andhra Pradesh State Eligibility Test Result : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల అర్హత కోసం నిర్వహించిన 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష' (AP SET ) ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను మే 30వ తేదీన విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఏపీ సెట్ ఫలితాలపై అప్డేట్ (istock image)
ఏపీ సెట్ ఫలితాలపై అప్డేట్ (istock image)

ఏపీ సెట్ పరీక్షను ఆంధ్రా విశ్వవిద్యాలయం నిర్వహించింది. మార్చి 28, 29 తేదీల్లో జరిగిన ఈ రాత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇప్పటికే ప్రాథమిక కీలు అందుబాటులోకి రాగా… అభ్యంతరాలను కూడా స్వీకరించారు. కానీ ఇంకా ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. దీంతో ఈ రిజల్ట్స్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ సెట్ ఫలితాలపై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నేల 30వ తేదీన విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అదే రోజు ఫలితాలతో పాటు సబ్జెక్టుల వారీగా, కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు, మెరిట్ జాబితాను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

ఏపీ సెట్ ఫలితాలు చెక్ చేసుకోవటం ఎలా..?

  1. మొదట ఏపీ సెట్ అధికారిక వెబ్‌సైట్ apset.net.in ను సందర్శించాలి.
  2. హోం పేజీలో కనిపించే “APSET Result / Scorecard” లింక్‌పై క్లిక్ చేయాలి.
  3. అభ్యర్థి తమ హాల్ టికెట్ నంబర్ (లేదా రిజిస్ట్రేషన్ నంబర్) మరియు పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను నమోదు చేయాలి.
  4. వివరాలు సమర్పించిన తర్వాత మీ స్క్రీన్‌పై ఏపీ సెట్ స్కోర్‌కార్డ్ డిస్ ప్లే అవుతుంది.
  5. భవిష్యత్తు అవసరాల కోసం స్కోర్‌కార్డ్‌ను ప్రింట్ అవుట్ తీసి భద్రపరుచుకోవాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe