AP SSC Exam Fee Dates : ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల - చెల్లింపు తేదీలివే

AP Class 10 Exam Fee Schedule : ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది. ఈ నెల 11 నుంచి 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. 

Published on: Nov 8, 2026, 09:26:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

AP Class 10 Exam Fee Schedule : పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక సమాచారం అందించింది. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపుల పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నిర్దేశిత వ్యవధిలోగా ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు దేవానంద్ రెడ్డి (శ్రీనివాసులురెడ్డి) ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

ఏపీ టెన్త్ పరీక్షలు
ఏపీ టెన్త్ పరీక్షలు

ఎగ్జామ్ ఫీజు చెల్లింపు తేదీలు

విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము (లేట్ ఫీజు) లేకుండా ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. నిర్ణీత వ్యవధి దాటిన తర్వాత కూడా విద్యార్థులు ఫైన్‌తో ఫీజు చెల్లించేందుకు వేర్వేరు గడువులను నిర్ణయించారు.

  • రూ. 50 అపరాధ రుసుముతో ఈ నెల 26వ తేదీ నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు
  • రూ. 200 అపరాధ రుసుముతో డిసెంబరు 3వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు
  • రూ. 500 అపరాధ రుసుముతో డిసెంబరు 10వ తేదీ నుంచి డిసెంబరు 15వ తేదీ వరకు చెల్లించవచ్చు.

పరీక్షలు రాసే విద్యార్థుల విభాగాలను బట్టి రుసుము వివరాలను పరీక్షల విభాగం సమగ్రంగా వెల్లడించింది.

  • రెగ్యులర్ విద్యార్థులు (మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు రాసేవారు): రూ. 125
  • సప్లిమెంటరీ/కంపార్ట్‌మెంటల్ (మూడు సబ్జెక్టుల వరకు రాసేవారు): రూ. 110
  • వృత్తివిద్య (వొకేషనల్) అభ్యర్థులు సాధారణ ఫీజుకు అదనంగా రూ. 60 చెల్లించాలి.
  • నిర్ణీత వయసు నిబంధనల నుంచి సడలింపు కోరే విద్యార్థులు అదనంగా రూ. 300 సడలింపు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఫీజు చెల్లింపు ప్రక్రియను సమయానికి పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ముందే ఫీజు చెల్లించుకోవడం మంచిదని స్పష్టం చేశారు. పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తయ్యేలోపు ఎగ్జామ్ షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More