ఏపీలో కొత్త పాఠశాలల ఏర్పాటు సులభతరం.. నిబంధనలు సరళీకరిస్తూ ఉత్తర్వులు!
ఏపీలో కొత్త స్కూళ్ల ఏర్పాటు నిబంధనలను ప్రభుత్వం సరళీకరించింది. కఠిన నిబంధనలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ విద్యా సంస్థల రూల్స్‌కు సవరణలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ప్రీప్రైమరీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రారంభించాలనుకునే యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట నిచ్చింది. పాఠశాలల స్థాపన, గుర్తింపు ప్రక్రియలో ఇప్పటివరకు ఉన్న కఠినమైన నిబంధనలను సవరిస్తూ విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై అనుమతుల కోసం నెలల తరబడి వివిధ ప్రభుత్వ శాఖల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సులభమైన పద్ధతిలో నిబంధనలను సరళీకరించింది.

ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల నిబంధనలకు సవరణలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఈ నిర్ణయంతో కొత్తగా స్కూళ్లు పెట్టాలనుకునేవారికి సులభం కానుంది. కొత్త సవరణల ప్రకారం ప్రైవేట్, నిధులందించే పాఠశాలల అనుమతుల ప్రక్రియలో పారదర్శకత పెంచేలా అధికారుల బాధ్యతలను స్పష్టంగా వర్గీకరించారు.
ప్రీ-ప్రైమరీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల స్థాపనకు జిల్లా విద్యాశాఖాధికారి(DEO) స్థాయిలోనే అనుమతులు లభిస్తాయి. సెకండరీ పాఠశాలల ఏర్పాటుకు సంబంధిత ప్రాంతీయ విద్యా డైరెక్టర్లు (RJD) అనుమతులు జారీ చేస్తారు. గతంలో పారిశుధ్యం, ట్రాఫిక్, స్థానిక సంస్థల అనుమతుల కోసం తీవ్ర జాప్యం జరిగేది. ప్రయాసతో కూడుకున్న ఈ ప్రక్రియకు చెక్ పెడుతూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ట్రాఫిక్, పోలీస్ శాఖ, మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీల నుంచి తీసుకోవాల్సిన ఎన్‌ఓసీ (NOC) స్థానంలో యాజమాన్యాలు ఇచ్చే స్వీయ ధ్రువీకరణ పత్రం సరిపోతుంది. శానిటేషన్ సర్టిఫికేట్ స్థానంలో కూడా స్వీయ ప్రమాణ పత్రాన్ని సమర్పించేందుకు వెసులుబాటు కల్పించారు.
స్వీయ ధ్రువీకరణ వెసులుబాటును దుర్వినియోగం చేస్తూ తప్పుడు సమాచారం లేదా నకిలీ పత్రాలు సమర్పిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. అటువంటి యాజమాన్యాలకు రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. నిబంధనలు సరళీకరించినప్పటికీ విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. ప్రతి పాఠశాల యాజమాన్యం క్రింది ప్రమాణాలను నూటికి నూరు శాతం పాటించాల్సిందే.
అగ్నిమాపక భద్రతా ప్రమాణాలకు సంబంధించిన సర్టిఫికేట్ తప్పనిసరి. పాఠశాల భవన నిర్మాణ నాణ్యత, నిలకడను ధృవీకరించే పత్రం చూపించాలి. భవన వినియోగ అనుమతి పత్రం ఉండాలి.
పాఠశాలల అనుమతి ప్రక్రియను వేగవంతం చేసేందుకు విద్యాశాఖ స్పష్టమైన గడువులను నిర్దేశించింది. విద్యా సంవత్సరంలో అక్టోబరు 31 వరకు ఎలాంటి అదనపు రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో గడువు రూ. 50,000 ఫైన్‌తో డిసెంబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉంది.
సమర్పించిన దరఖాస్తులపై గరిష్టంగా మూడు నెలల (90 రోజులు) వ్యవధిలోనే అనుమతులు మంజూరు చేస్తారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల అనుమతి నిరాకరిస్తే, దానికి గల స్పష్టమైన కారణాలను ఉత్తర్వుల్లో పేర్కొనాల్సి ఉంటుంది. పాఠశాలల గుర్తింపు ప్రక్రియ మొత్తాన్ని ఆన్‌లైన్ సింగిల్ విండో పోర్టల్ ద్వారానే నిర్వహిస్తారు. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకత పెరుగుతుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


