AP SSC Supplementary Results : ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - మీ మెమో ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి

AP 10th Supplementary Results 2026 : ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను www.results.bse.ap.gov.in లేదా మనమిత్ర వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

Published on: Jun 19, 2026, 10:09:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP 10th Supplementary Results 2026 : ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ద్వారా ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు.

ఏపీ టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు 2026
ఏపీ టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు 2026

ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. మొత్తం 94,990 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కాగా.. వారిలో 78,261 మంది విజయవంతంగా ఉత్తీర్ణత సాధించారు.

గత ఏడాది పాస్ పర్సంటేజ్ 76.14 శాతంగా ఉండగా.. ఈసారి అది ఏకంగా 6.25 శాతం పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడటానికి, విద్యార్థుల కష్టానికి ఈ ఫలితాలే నిదర్శనమని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

విద్యార్థులు తమ మార్కులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా చూసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రత్యేక లింకులను సిద్ధం చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ సాయంతో ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి:

  1. మొదట అధికారిక వెబ్‌సైట్ www.results.bse.ap.gov.in ను సందర్శించాలి.
  2. హోమ్ పేజీలో కనిపించే 'AP SSC Advanced Supplementary Results' లింక్‌పై క్లిక్ చేయాలి.
  3. మీ పదో తరగతి సప్లిమెంటరీ హాల్ టికెట్ నంబర్‌ను అక్కడ నమోదు చేయాలి.
  4. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయగానే మీ మార్కుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  5. భవిష్యత్తు అవసరాల కోసం ఆ మార్కుల జాబితాను ప్రింట్ అవుట్ లేదా పిడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకోవడం మంచిది.

వాట్సాప్ లో ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు

  • మీ మొబైల్‌లో 95523 00009 నంబర్‌ను సేవ్ చేయండి.
  • వాట్సాప్‌లో ఈ నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపండి.
  • మెనూలో 'Education Services' ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • ఆ తర్వాత 'డౌన్లోడ్ SSC సప్లిమెంటరీ ఫలితాలు' అనే లింక్ పై క్లిక్ చేయాలి.
  • మీ హాల్ టికెట్ నంబర్ ఇస్తే చాలు. మీ మార్కుల మెమో డిస్ ప్లే అవుతుంది.

సాధారణంగా సప్లిమెంటరీ పరీక్షల్లో ఇంతటి ఉత్తీర్ణత నమోదు కావడం వెనుక ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ప్రధాన కారణంగా నిలిచింది. పదో తరగతి ప్రధాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా '20 రోజుల యాక్షన్ ప్లాన్' (20-Day Action Plan) అమలు చేసింది. ఈ ప్రణాళిక ద్వారా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇచ్చారు. ఉపాధ్యాయులు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని, విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి పరీక్షలకు సిద్ధం చేశారు. తీవ్రమైన అకడమిక్ సపోర్ట్, నిరంతర మార్గదర్శకత్వం అందించడం వల్లే ఈ అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయని మంత్రి లోకేశ్ అభినందించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More