...
...
Next Story

AP 10th Supply Hall Ticket 2026 : ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల - డౌన్లోడ్ లింక్, టైమ్ టేబుల్ వివరాలివే

AP SSC Supplementary Hall Tickets 2026 : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు 'మనమిత్ర' వాట్సాప్ సర్వీస్ ద్వారా కూడా వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published on: May 20, 2026 07:08 AM IST
Advertisement

AP SSC Supplementary Hall Tickets 2026 : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అలర్ట్ వచ్చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌తో పాటు మనమిత్ర వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు.

ఏపీ టెన్త్ పరీక్షలు 2026
ఏపీ టెన్త్ పరీక్షలు 2026

ఈ ఏడాది ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 25, 2026 నుంచి జూన్ 4, 2026 వరకు నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇందుకోసం ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.

హాల్ టికెట్ డౌన్లోడ్ ఇలా:

  1. మొదట బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in ను సందర్శించాలి.
  2. హోం పేజీలో కనిపించే "AP SSC Advanced Supplementary Hall Ticket 2026" లింక్‌పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ మీ జిల్లా, పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలను సరిగ్గా నమోదు చేయాలి.
  4. వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత 'Download Hall Ticket' బటన్‌పై క్లిక్ చేస్తే స్క్రీన్‌పై హాల్ టికెట్ కనిపిస్తుంది.
  5. దీన్ని పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్‌అవుట్ తీసుకోవాలి.

ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం 'మనమిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ ద్వారా కూడా హాల్ టికెట్లను అందుబాటులోకి తెచ్చారు. చాలా సులభంగా హాల్ టికెట్ ను పొందొచ్చు.

  • మొదట మీ మొబైల్‌లో 95523 00009 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి.
  • ఆ నంబర్‌కు వాట్సాప్‌లో "Hi" అని మెసేజ్ పంపాలి.
  • తిరుగు సమాధానంగా వచ్చే ఆప్షన్లలో "Choose Service" (సేవను ఎంచుకోండి) పై క్లిక్ చేసి "Education Services" (విద్యా సేవలు) ను ఎంచుకోవాలి.
  • అనంతరం అందులో "ASE 2026 Hall Ticket" అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు మీ పదో తరగతి (మార్చి 2026) రోల్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి.
  • వివరాలు సరిపోలితే, మీ హాల్ టికెట్ నేరుగా మీ వాట్సాప్‌లోనే పీడీఎఫ్ (PDF) రూపంలో ప్రత్యక్షమవుతుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe