...
...
Next Story

AP TET 2025 : ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - అన్ని పేపర్ల ప్రాథమిక కీలు విడుదల, జనవరిలో ఫలితాలు..!

ఏపీ టెట్ - 2025 పరీక్షలు ముగిశాయి. దీంతో అన్ని సబ్జెక్టుల ప్రాథమిక కీలను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. జనవరి 19వ తేదీన ఫలితాలను ప్రకటించింది.

Published on: Dec 24, 2025, 11:46:35 IST
Advertisement

ఏపీ టెట్ - 2025 పరీక్షలపై విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈనెల 21వ తేదీతో అన్ని పేపర్లు పూర్తి కాగా… వీటికి సంబంధించి అన్ని ప్రాథమిక కీలను విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు… వీటిపై ఏమైనా అభ్యంతరాలుంటే పంపొచ్చని సూచించింది.

ఏపీ టెట్ ప్రాథమిక కీలు విడుదల
ఏపీ టెట్ ప్రాథమిక కీలు విడుదల

డిసెంబర్ 10వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉదయం, మధ్యాహ్నం సెషన్లవారీగా ఈ ఎగ్జామ్స్ ను నిర్వహించగా… ఈనెల 21వ తేదీతో అన్ని పేపర్లు పూర్తయ్యాయి. ముందుగా కొన్ని పేపర్ల ప్రాథమిక కీలను విడుదల చేయగా… తాజాగా మిగతా పేపర్ల ప్రాథమిక కీలు కూడా వచ్చేశాయి. దీంతో అన్ని సబ్జెక్టుల కీలు అందుబాటులోకి వచ్చినట్లు అయింది. వీటిపై ప్రస్తుతం అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. అభ్యర్థుల వారి లాగిన్ వివరాలతో ప్రాథమిక కీలపై అభ్యంతరాలను తెలపవచ్చని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

ఏపీ టెట్ ప్రాథమిక కీలు - డౌన్లోడ్ ప్రాసెస్

  • ఏపీ టెట్ అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని టెట్ ప్రిలిమినరీ ఆన్సర్ కీ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ సబ్జెక్ట్ పేపర్లు కనిపిస్తాయి. తేదీలు, సెషన్ల వారీగా వివరాలుంటాయి.
  • చివర్లో ఉండే కీ లింక్ పై క్లిక్ చేస్తే పీడీఎఫ్ డౌన్లోడ్ అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ప్రాథమిక కీలను పొందవచ్చు.

జనవరిలో టెట్ ఫలితాలు…!

ఈసారి జరిగే టెట్ పరీక్షల కోసం మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు సమర్పించారు. ఇందులో కొందరు పేపర్ 1తో పాటు పేపర్ 2 కు కూడా అప్లయ్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈసారి టెట్‌కు భారీగానే ఇన్ సర్వీస్ టీచర్లు హాజరయ్యారు. విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారం… జనవరి 13వ తేదీన ఏపీ టెట్ పరీక్షల ఫైనల్ కీని ప్రకటిస్తారు.జనవరి 19వ తేదీన టెట్ ఫలితాలను వెల్లడిస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks