ఏపీ టెట్ పరీక్షలు డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే పరీక్షల నిర్వహణకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఈనెల 10 నుంచి పరీక్షలు…

విద్యాశాఖ వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం… డిసెంబర్ 10వ తేదీ నుంచి టెట్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. మొదటి రోజు తెలు లాంగ్వేజ్ పరీక్ష ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహిస్తారు. 11వ తేదీన పలు భాషాలకు సంబంధించిన పరీక్షలుంటాయి. 17వ తేదీ సోషల్ స్టడీస్, 19వ తేదీన మ్యాథ్స్ అండ్ సైన్స్ తో పాటు ఇతర సబ్జెక్టుల పేపర్లను నిర్వహిస్తారు.
ఉదయం 9.30 గంటల నుంచి 12గంటలు ఒక సెషన్ ఉండగా.., మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. .మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతిదీ కూడా ఒక మార్కును కలిగి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండదు.
ఎన్ని దరఖాస్తులంటే…?
ఈసారి జరిగే టెట్ పరీక్ష కోసం మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు సమర్పించారు. ఇందులో కొందరు పేపర్ 1తో పాటు పేపర్ 2 కు కూడా అప్లయ్ చేసుకున్నారు. జనవరి 2వ తేదీన ప్రాథమిక కీలు విడుదలవుతాయి.జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. జనవరి 13వ తేదీన ఫైనల్ కీని ప్రకటిస్తారు.జనవరి 19వ తేదీన తుది ఫలితాలను ప్రకటిస్తారు.
టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలు ఉంటుంది. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లోనూ బోధించాలంటే టెట్ అర్హత తప్పనిసరి చేశారు. కాబట్టి టెట్ లో మంచి స్కోర్ సాధించేందుకు అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతుంటారు. ఇందులో సాధించే స్కోర్… డీఎస్సీలో వెయిటేజీగా తీసుకుంటారు.
{{/usCountry}}టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలు ఉంటుంది. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లోనూ బోధించాలంటే టెట్ అర్హత తప్పనిసరి చేశారు. కాబట్టి టెట్ లో మంచి స్కోర్ సాధించేందుకు అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతుంటారు. ఇందులో సాధించే స్కోర్… డీఎస్సీలో వెయిటేజీగా తీసుకుంటారు.
{{/usCountry}}మరోవైపు ఏపీ టెట్ కోసం సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ మాక్ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్యాశాఖ ఈ అవకాశాన్ని కల్పించింది.