AP TET 2025 : ఏపీ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - ఏ రోజు ఏ పరీక్షంటే..?

ఏపీ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 10వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభమవుతుండగా… డిసెంబర్ 21వ తేదీతో అన్ని సబ్జెక్టుల పేపర్లు పూర్తవుతాయి. https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Published on: Dec 7, 2025, 08:42:08 IST
By , Andhrapradesh
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ టెట్ పరీక్షలు డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే పరీక్షల నిర్వహణకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఏపీ టెట్
ఏపీ టెట్

ఈనెల 10 నుంచి పరీక్షలు…

విద్యాశాఖ వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం… డిసెంబర్ 10వ తేదీ నుంచి టెట్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. మొదటి రోజు తెలు లాంగ్వేజ్ పరీక్ష ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహిస్తారు. 11వ తేదీన పలు భాషాలకు సంబంధించిన పరీక్షలుంటాయి. 17వ తేదీ సోషల్ స్టడీస్, 19వ తేదీన మ్యాథ్స్ అండ్ సైన్స్ తో పాటు ఇతర సబ్జెక్టుల పేపర్లను నిర్వహిస్తారు.

ఉదయం 9.30 గంటల నుంచి 12గంటలు ఒక సెషన్ ఉండగా.., మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. .మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతిదీ కూడా ఒక మార్కును కలిగి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండదు.

ఎన్ని దరఖాస్తులంటే…?

ఈసారి జరిగే టెట్ పరీక్ష కోసం మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు సమర్పించారు. ఇందులో కొందరు పేపర్ 1తో పాటు పేపర్ 2 కు కూడా అప్లయ్ చేసుకున్నారు. జనవరి 2వ తేదీన ప్రాథమిక కీలు విడుదలవుతాయి.జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. జనవరి 13వ తేదీన ఫైనల్ కీని ప్రకటిస్తారు.జనవరి 19వ తేదీన తుది ఫలితాలను ప్రకటిస్తారు.

టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలు ఉంటుంది. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లోనూ బోధించాలంటే టెట్ అర్హత తప్పనిసరి చేశారు. కాబట్టి టెట్ లో మంచి స్కోర్ సాధించేందుకు అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతుంటారు. ఇందులో సాధించే స్కోర్… డీఎస్సీలో వెయిటేజీగా తీసుకుంటారు.

మరోవైపు ఏపీ టెట్ కోసం సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్యాశాఖ ఈ అవకాశాన్ని కల్పించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More