AP TET Results : ఏపీ టెట్ అభ్యర్థులకు అప్డేట్ - ఈనెల 19న ఫలితాలు...!

ఏపీ టెట్ పరీక్షలు పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రాథమిక కీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇందుకు సంబంధించిన  ఫలితాలను ఈనెల 19వ తేదీన ప్రకటించనున్నారు.

Published on: Jan 4, 2026, 06:02:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ టెట్ - 2025 పరీక్షలు ముగిశాయి. దీంతో అన్ని సబ్జెక్టుల ప్రాథమిక కీలను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించింది. వీటిని పరిశీలించిన తర్వాత తుది కీలను ప్రకటించనుంది. ఫైనల్ కీలను జనవరి 13వ తేదీన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఏపీ టెట్ ఫలితాలు
ఏపీ టెట్ ఫలితాలు

ఈనెల 19న ఫలితాలు…

మరోవైపు ఏపీ టెట్ ఫలితాలపై కూడా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… ఈనెల 19వ తేదీన టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఆ దిశగానే విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

డిసెంబర్ 10వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉదయం, మధ్యాహ్నం సెషన్లవారీగా ఈ ఎగ్జామ్స్ ను నిర్వహించగా… డిసెంబర్ 21వ తేదీతో అన్ని పేపర్లు పూర్తయ్యాయి. ముందుగా కొన్ని పేపర్ల ప్రాథమిక కీలను విడుదల చేయగా… ఆ తర్వాత మిగతా పేపర్ల ప్రాథమిక కీలను కూడా ప్రకటించారు.

ఈసారి జరిగిన ఏపీ టెట్ పరీక్షల కోసం మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు సమర్పించారు. ఇందులో కొందరు పేపర్ 1తో పాటు పేపర్ 2 కు కూడా అప్లయ్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈసారి టెట్‌కు భారీగానే ఇన్ సర్వీస్ టీచర్లు హాజరయ్యారు. విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారం… జనవరి 13వ తేదీన ఏపీ టెట్ పరీక్షల ఫైనల్ కీని ప్రకటిస్తారు.జనవరి 19వ తేదీన టెట్ ఫలితాలను వెల్లడిస్తారు.

ఏపీ టెట్ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..?

  • ఏపీ టెట్ అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని ఫలితాల లింక్ పై క్లిక్ చేయాలి.
  • అభ్యర్థి వివరాలతో లాగిన్ కావాలి.
  • సబ్మిట్ చేస్తే అభ్యర్థి సాధించిన స్కోర్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ప్రాథమిక కీలను పొందవచ్చు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More