...
...
Next Story

AP TET 2026 Notification : ఏపీ టెట్ దరఖాస్తులు ప్రారంభం - ఇలా అప్లయ్ చేసుకోండి

AP TET 2026 Notification : ఏపీ టెట్ 2026 దరఖాస్తుల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jun 5, 2026, 11:22:29 IST
Advertisement

AP TET 2026 Notification : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకునే వారికి ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2026) దరఖాస్తుల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపీ టెట్ దరఖాస్తులు 2026 (image source istock)
ఏపీ టెట్ దరఖాస్తులు 2026 (image source istock)

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించి… అందులో ఇచ్చిన మార్గదర్శకాలను పూర్తిగా చదువుకోవాలి. ఆ తర్వాతే తమ విద్యార్హత పత్రాలు, ఇతర వివరాలతో అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము చెల్లింపు, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయడం వంటి ప్రక్రియలను గడువులోగా పూర్తి చేయాలని విద్యాశాఖ సూచించింది.

జూలై 5 వరకు గడువు…

అర్హులైన అభ్యర్థులు జూలై 5 వరకు నెల రోజుల పాటు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై 25వ తేదీ నుంచి హాల్ టికెట్లను జారీ చేస్తారు.

ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు ఏపీ టెట్ పరీక్షలను ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్షలు ముగిసిన తర్వాత సమాధాన పత్రాల పరిశీలన పూర్తి చేసి, సెప్టెంబర్ 15వ తేదీన తుది ఫలితాలను విడుదల చేస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, సిలబస్, ఫీజుల వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tet2dsc.apcfss.in ను సందర్శించాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ముందు టెట్ నిర్వహించడం సర్వసాధారణం. ఈ పరీక్షలో సాధించే మార్కులకు డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో కీలకమైన వెయిటేజీ ఉంటుంది. అందుకే అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపీ టెట్ 2026 - దరఖాస్తు విధానం ఇలా :

  1. అభ్యర్థులు ముందుగా https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
  3. మీ ఆధార్ నెంబర్ ఆధారంగా ముందుగా ప్రాథమికంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  4. ఆ తర్వాత మీ పూర్తి వివరాలను నమోదు చేయటమే కాకుండా ఫొటో, సంతకం కూడా అప్ లోడ్ చేయాలి.
  5. చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.

ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి ఏపీ టెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks