TG TET 2026 Hall Tickets : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అప్డేట్ - హాల్ టికెట్లు ఎప్పుడంటే..?
TG TET Hall Tickets 2026 : తెలంగాణ టెట్ (TG TET) హాల్ టికెట్లు ఈనెల 9వ తేదీన విడుదల కానున్నాయి. జూన్ 16 నుంచి 22 వరకు ఆన్‌లైన్ విధానంలో మొత్తం 10 సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి.
TG TET Hall Tickets 2026 : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఈనెల 9వ తేదీన విడుదల కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

జూన్ 16 నుంచి పరీక్షలు….
మరోవైపు టీజీ టెట్ 2026(జూన్ సెషన్) పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. జూన్ 16వ తేదీ నుంచి జూన్ 22వ తేదీ వరకు ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత) విధానంలో ఈ పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు.
ఈ ఏడాది టెట్ పరీక్షలను మొత్తం 10 సెషన్లలో, 5 రోజుల పాటు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. మొదటి షిఫ్ట్ (షిఫ్ట్ I) ఉదయం 9:00 గంటల నుంచి 11:30 గంటల వరకు ఉంటుంది. ఇక రెండో షిఫ్ట్ (షిఫ్ట్ II) మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు జరుగుతుంది. అభ్యర్థులు తమకు కేటాయించిన సెషన్, సమయం వివరాలను హాల్ టికెట్ లో పరిశీలించుకోవాలి.
ఈ విడత టెట్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,36,418 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పేపర్ I కోసం 32,779 మంది అభ్యర్థులు, పేపర్ II కోసం 86,305 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. రెండు పేపర్లకు (పేపర్ I మరియు పేపర్ II) కలిపి 17,334 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఈసారి టెట్ రాస్తున్న వారిలో ప్రభుత్వ సేవలో కొనసాగుతున్న ఉపాధ్యాయులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మొత్తం దరఖాస్తుదారులలో 28,149 మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో 13,714 మంది పురుషులు, 14,430 మంది మహిళా ఉపాధ్యాయులు కాగా.. ఐదుగురు ట్రాన్స్‌జెండర్లు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 16 నుంచి ప్రారంభం కానున్న ఈ ఆన్‌లైన్ పరీక్షల కోసం విద్యాశాఖ అన్ని కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.
టీజీ టెట్ హాల్ టికెట్ - ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే..?
- దరఖాస్తుదారులు https://tgtet.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని టీజీ టెట్ హాల్ టికెట్ (జూన్ 2026) లింక్ పై క్లిక్ చేయాలి.
- జర్నల్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- డౌన్లోడ్ లేదా ప్రింట్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
- పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

