...
...
Next Story

AP TET 2026 Hall Ticket : ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - ఇవాళ్టి నుంచే హాల్ టికెట్లు, డౌన్లోడ్ ప్రాసెస్ ఇలా

AP TET Hall Tickets 2026 : ఇవాళ ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదలవుతాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 5 నుంచి ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Published on: Jul 25, 2026, 09:49:45 IST
Advertisement

AP TET Hall Tickets 2026 : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) రాయడానికి సిద్ధమవుతున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ అందించింది. ఇవాళ్టి నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు అందబాటులోకి వస్తాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆగస్ట్ 5 నుంచి ఏపీ టెట్ పరీక్షలు…

ఏపీ టెట్ అప్డేట్
ఏపీ టెట్ అప్డేట్

ఏపీ టెట్ పరీక్షలను ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలన్నింటినీ పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT - ఆన్‌లైన్ పద్ధతి) రూపంలో వివిధ సెషన్లలో నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌లో పేర్కొన్న తేదీ, సెషన్, రిపోర్టింగ్ సమయం ప్రకారం నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష విధానంపై ఇప్పటికే అవగాహన కల్పించేందుకు మాక్ టెస్ట్‌లను కూడా అందుబాటులో ఉంచారు.

పరీక్షల నిర్వహణ ముగిసిన వెంటనే… సమాధాన పత్రాల పరిశీలన, ప్రాథమిక కీ డుదల, అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ తదితర ప్రక్రియలను విద్యాశాఖ వేగంగా పూర్తి చేయనుంది. నిపుణుల కమిటీ పరిశీలన అనంతరం…. సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ టెట్ తుది ఫలితాలను విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ నియామక పరీక్షలకు (DSC) టెట్ అర్హత కీలకం కావడం వల్ల అభ్యర్థులు అందరూ ఈ పరీక్షలను అత్యంత సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారు.

ఏపీ టెట్ హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేయాలి

  1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://tet2dsc.apcfss.in/ ని సందర్శించండి.
  2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న AP TET హాల్ టికెట్ 2026 లింక్‌పై క్లిక్ చేయండి.
  3. అభ్యర్థులు క్యాండిడేట్ లాగిన్‌ మీద క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాలి.
  4. యూజర్ నేమ్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌లను ఎంటర్ చేయాలి.
  5. సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి, మీ అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది.
  6. అడ్మిట్ కార్డును తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాతి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచుకోండి.

మాక్ టెస్టులు రాయడం వల్ల కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఎలా ఉంటుందో అభ్యర్థులకు ముందే ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. నిర్ణీత సమయంలో ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలము అనే విషయాన్ని కూడా అభ్యర్థులు స్వయంగా విశ్లేషించుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాల్లో (DSC) టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు. అంటే టెట్‌లో సాధించే ప్రతి మార్కు అభ్యర్థుల ఉపాధ్యాయ కొలువు కలని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే అభ్యర్థులు ఈ పరీక్షను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రిపేర్ అవుతున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe