AP TET Syllabus 2026 : ఏపీ టెట్ అప్డేట్ - సిలబస్ విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి
AP TET Syllabus 2026 : ఏపీ టెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈసారి విడుదలైన నోటిఫికేషన్ కు సంబంధించిన సిలబస్ వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులోకి ఉంచారు.
ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు జూలై 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై 25వ తేదీ నుంచి హాల్ టికెట్లను జారీ చేస్తారు.

ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు ఏపీ టెట్ పరీక్షలను ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్షలు ముగిసిన తర్వాత సమాధాన పత్రాల పరిశీలన పూర్తి చేసి, సెప్టెంబర్ 15వ తేదీన తుది ఫలితాలను విడుదల చేస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్ వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://tet2dsc.apcfss.in లో పొందుపరిచారు.
ఏపీ టెట్ సిలబస్ - ముఖ్యమైన వివరాలు
ఏపీ టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలు ఉంటుంది. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లోనూ బోధించాలంటే టెట్ అర్హత తప్పనిసరి చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ టెట్ 2026 పరీక్ష విధానమేంటి..? సిలబస్ కాపీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి
టెట్‌ను పేపర్–1ఎ, 1బి, పేపర్–2ఎ, 2బిల పేరుతో మొత్తం నాలుగు పేపర్లుగా నిర్వహించనున్నారు. పేపర్–1ఎ చూస్తే ఒకటి నుంచి అయిదో తరగతి వరకు ఉపాధ్యాయులుగా బోధించాలనుకునే వారు రాయాల్సిన పరీక్ష.. కాగా పేపర్–1బి అనేది ఒకటి నుంచి 5వ తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేయాలనుకునే వారు రాయాల్సి ఉంటుంది.
ఇక పేపర్–2ఎ చూస్తే….. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్‌గా బోధించాలనుకునే వారు ఉత్తీర్ణత సాధించాల్సిన పేపర్ ఇది. ఇక పేపర్–2బి చూస్తే ఆరు నుంచి 8వ తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌గా బోధించాలనుకునే వారు అర్హత సాధించాల్సి ఉంటుంది.
పేపర్–2ఎ చూస్తే… ఇందులో చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి నుంచి 30 మార్కులు వస్తాయి. ఇక లాంగ్వేజ్ 1 నుంచి 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ నుంచి 30 మార్కులు, సంబంధిత సబ్జెక్ట్ నుంచి 60 మార్కులు ఇస్తారు.
మొత్తం 150 మార్కులకు గానూ పరీక్ష నిర్వహిస్తారు. నాలుగో విభాగంగా నిర్వహించే సంబంధిత సబ్జెక్ట్ విషయంలో..మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ అభ్యర్థులు మ్యాథ్స్, సైన్స్ విభాగాన్ని, సోషల్ టీచర్లు సోషల్ స్టడీస్ విభాగాన్ని ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది.
పేపర్–2 బిలో చూస్తే చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి నుంచి 30 మార్కులు, లాంగ్వేజ్1 నుంచి 30, గ్వేజ్ 2(ఇంగ్లిష్)-30, డిజేబిలిటీ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అండ్ పెడగాజి నుంచి 60 మార్కులు ఇస్తారు. మొత్తం 150 మార్కులకుగానూ పరీక్ష నిర్వహిస్తారు. పేపర్–2బిలో నాలుగో విభాగంలో అభ్యర్థులు స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులో చదివిన సబ్జెక్ట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఏపీ టెట్ 2026 - సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే సిలబస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఏపీ టెట్ సిలబస్ 2026 అని డిస్ ప్లే అవుతుంది. దాని పక్కన ఉండే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ ఏపీ టెట్ సిలబస్ తో కూడిన పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. అన్ని సబ్జెక్టుల వివరాలుంటాయి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని తీసుకోవచ్చు.
ఈ లింక్ పై క్లి క్ చేసి ఏపీ టెట్ సిలబస్ - 2026 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

