...
...
Next Story

AP TET 2026 : ఏపీ టెట్ అభ్యర్థులకు అప్డేట్.. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు వన్-టైమ్ డిలీట్ ఆప్షన్

AP TET 2026 : ఏపీ టెట్ అభ్యర్థులకు ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు వన్-టైమ్ డిలీట్ ఆప్షన్‌ కల్పించింది.

Published on: Jul 2, 2026, 06:56:31 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET - June 2026) అప్లికేషన్లలో తప్పులు దొర్లి ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఆన్‌లైన్ దరఖాస్తులలో తప్పులను సరిదిద్దుకునేందుకు వీలుగా ‘వన్-టైమ్ డిలీట్’ (One-Time Delete Option) సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఏపీ టెట్ కన్వీనర్ ఎం. వెంకటకృష్ణారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.

ఏపీ టెట్ 2026
ఏపీ టెట్ 2026

ఏపీ టెట్ జూన్ 2026 నోటిఫికేషన్ ఈ ఏడాది జూన్ 5న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి జూలై 5, 2026ని చివరి తేదీగా నిర్ణయించారు. అయితే చాలా మంది అభ్యర్థులు అప్లికేషన్ పూరించే సమయంలో పేరు, విద్యార్హతలు, పుట్టిన తేదీ లేదా ఫోటో, సంతకం వంటి వివరాలను తప్పుగా నమోదు చేశామని, వాటిని మార్చుకునే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ వన్-టైమ్ డిలీట్ ఆప్షన్ ద్వారా అభ్యర్థులు తమ పాత (తప్పులున్న) దరఖాస్తును డిలీట్ చేసి, ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా మళ్లీ కొత్తగా సరైన వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ అవకాశం కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే లభిస్తుందని, కాబట్టి ఈసారి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా వివరాలను పరిశీలించుకుని అప్లై చేయాలని కన్వీనర్ సూచించారు.

టెట్ జూన్ 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు జూలై 5 చివరి తేదీ. చివరి నిమిషంలో సర్వర్ డౌన్ లేదా సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, అభ్యర్థులు గడువు ముగిసే వరకు వేచి చూడకుండా వెంటనే తమ దరఖాస్తులను పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫీజు చెల్లించి, ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ టెట్ పరీక్ష అభ్యర్థులకు అత్యంత కీలకంగా మారింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks