...
...
Next Story

AP TET Mock Tests : ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - మాక్‌ టెస్టులు ప్రారంభం, ఇదిగో డైరెక్ట్ లింక్

AP TET Mock Tests : ఏపీ టెట్ 2026 అభ్యర్థుల కోసం విద్యాశాఖ ఉచిత మాక్ టెస్టులను అందుబాటులోకి తెచ్చింది. జూలై 25 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 5 నుంచి ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Published on: Jul 11, 2026 01:35 PM IST
Advertisement

AP TET Mock Tests : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) రాసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్ అందించింది. పరీక్షలకు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్షా విధానంపై పట్టు సాధించేందుకు వీలుగా అధికారిక వెబ్‌సైట్‌లో ఉచిత మాక్ టెస్టుల ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సదుపాయం ద్వారా అభ్యర్థులు ఎగ్జామ్ పాటర్న్‌ను అర్థం చేసుకోవడంతో పాటు టైం మేనేజ్‌మెంట్‌ను ప్రాక్టీస్ చేయవచ్చు.

ఉచిత మాక్ టెస్ట్ ఎలా రాయాలంటే?

ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - మాక్‌ టెస్టులు ప్రారంభం
ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - మాక్‌ టెస్టులు ప్రారంభం

టెట్ అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా ఈ మాక్ టెస్టులను ప్రాక్టీస్ చేయవచ్చు.

  • మొదటగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tet2dsc.apcfss.in/# లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపిస్తున్న 'మాక్ టెస్ట్ (Mock Test) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • వెంటనే స్క్రీన్‌పై మొత్తం 13 సబ్జెక్టులకు సంబంధించిన లింకులు విడివిడిగా కనిపిస్తాయి.
  • అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టుకు ఎదురుగా ఉన్న క్లిక్ హియర్ లింక్‌ను ఎంచుకోవాలి.
  • ఈ మాక్ టెస్ట్ రాయడానికి ఎలాంటి యూజర్ ఐడీ లేదా పాస్‌వర్డ్ అవసరం లేదు. నేరుగా 'సైన్-ఇన్' బటన్ నొక్కి ఉచితంగా పరీక్షను ప్రారంభించవచ్చు.

ఈ మాక్ టెస్టులు రాయడం వల్ల కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఎలా ఉంటుందో అభ్యర్థులకు ముందే ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. నిర్ణీత సమయంలో ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలము అనే విషయాన్ని కూడా అభ్యర్థులు స్వయంగా విశ్లేషించుకోవచ్చు.

ఆగస్టు 5 నుంచి టెట్ ఆన్‌లైన్ పరీక్షలు

విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…. ఏపీ టెట్ పరీక్షలను ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభించి, ఆగస్టు 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer Based Test) పద్ధతిలో రోజుకు రెండు సెషన్ల చొప్పున వివిధ తేదీల్లో నిర్వహిస్తారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాల్లో (DSC) టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు. అంటే టెట్‌లో సాధించే ప్రతి మార్కు అభ్యర్థుల ఉపాధ్యాయ కొలువు కలని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే అభ్యర్థులు ఈ పరీక్షను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రిపేర్ అవుతున్నారు.

ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి ఏపీ టెట్ మాక్ టెస్ట్ ను రాయవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe