Special TET : ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్.. త్వరలోనే నోటిఫికేషన్

Special TET : ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Published on: Jul 9, 2026, 05:37:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల్లో పనిచేస్తున్న టీచర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసులో ఉండి.. ఇంకా టెట్(TET) అర్హత సాధించని ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష(Special TET) నిర్వహించేందుకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది సీనియర్ ఉపాధ్యాయులకు పెద్ద ఉపశమనం దొరుకుతుంది.

సర్వీసులో ఉన్న టీచర్లకు స్పెషల్ టెట్
సర్వీసులో ఉన్న టీచర్లకు స్పెషల్ టెట్

సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి. 2011 కంటే ముందు ఉద్యోగాల్లో చేరి, ఐదేళ్లకు పైగా సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31 లోపు కచ్చితంగా టెట్ అర్హత సాధించాలి. ఒకవేళ ఈ గడువులోగా అర్హత సాధించకపోతే వారి సర్వీసుకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండటంతో విద్యాశాఖ ఈ ప్రత్యేక పరీక్షకు ఏర్పాట్లు చేస్తోంది.

సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిబంధనల నుండి మినహాయింపు ఇవ్వాలని, లేదా వారి కోసం ప్రత్యేకంగా ఒక పరీక్షను నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు ఎప్పటి నుంచో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి. రెగ్యులర్ అభ్యర్థులతోపాటుగా కాకుండా.. ఇన్-సర్వీస్ టీచర్ల కోసం విడిగా స్పెషల్ టెట్ పెట్టాలనే వారి డిమాండ్‌కు ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, విద్యాశాఖ రెండు రకాల పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతోంది. రెగ్యులర్ టెట్ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూసే కొత్త అభ్యర్థుల కోసం యథావిధిగా జరుగుతుంది. ప్రత్యేక టెట్ ప్రస్తుతం సర్వీసులో ఉండి, నిబంధనల ప్రకారం అర్హత సాధించాల్సిన సీనియర్ ఉపాధ్యాయుల కోసం మాత్రమే దీనిని నిర్వహిస్తారు. ఈ ఏడాది డిసెంబర్ లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో టెట్ పరీక్ష నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇటీవల సాధారణ టెట్ నోటిఫికేషన్‌కు సుమారు 74 వేల మంది ఇన్‌సర్వీస్ టీచర్లు అప్లై చేశారు.

ఇక రెగ్యులర్ టెట్ నోటిఫికేషన్ ఇప్పటికై విడుదలైన విషయం తెలిసిందే. ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు ఏపీ టెట్ పరీక్షలను ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్షలు ముగిసిన తర్వాత సమాధాన పత్రాల పరిశీలన పూర్తి చేస్తారు. సెప్టెంబర్ 15వ తేదీన తుది ఫలితాలు విడుదల అవుతాయి. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్ వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://tet2dsc.apcfss.in లో పొందుపరిచారు. ఈ సాధారణ టెట్‌లో అర్హత సాధించని ప్రభుత్వ ఉపాధ్యాయులు స్పెషల్ టెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More