AP TET 2026 Results : ఈనెలలోనే ఏపీ టెట్ ఫలితాలు - ఎక్కడ చెక్ చేసుకోవాలి..?
AP TET 2026 Results : ఏపీ టెట్ ఫలితాలపై విద్యాశాఖ కసరత్తు కొనసాగుతోంది. ఈనెల 8వ తేదీన ఫైనల్ ఆన్సర్ కీలు అందుబాటులోకి వస్తాయి. https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లో ఇవి అందుబాటులో ఉంటాయి. తుది ఫలితాలు కూడా ఇదే నెలలో విడుదలవుతాయి.
AP TET 2026 Results : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్) రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక కీలు అందుబాటులోకి రాగా…. తుది ఫలితాలు రావాల్సి ఉంది.

ఈనెల 15న ఫలితాలు…
విద్యాశాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 8వ తేదీన ఏపీ టెట్ ఫైనల్ ఆన్సర్ కీలు అందుబాటులోకి వస్తాయి. అభ్యర్థులు నమోదు చేసిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ తుది కీని విడుదల చేయనున్నారు. అనంతరం ఈ ఫైనల్ కీ ఆధారంగానే మార్కుల మూల్యాంకన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి…. సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ టెట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో నిర్వహించబోయే ఉపాధ్యాయ నియామక పరీక్షలకు (డీఎస్సీ) టెట్ మార్కులకు ప్రత్యేక వెయిటేజీ ఉంటుంది. దీంతో టెట్‌లో వచ్చే ప్రతి మార్కూ అభ్యర్థుల భవిష్యత్తును, ఉద్యోగ అవకాశాలను నిర్ణయించడంలో అత్యంత కీలకంగా మారనుంది. అందుకే పరీక్షలు రాసిన అభ్యర్థులందరూ ఆన్సర్ కీలతో పాటు ఫలితాల విడుదల కోసం తీవ్ర ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఏపీ టెట్ ఆన్సర్ కీ, ఫలితాలు చెక్ చేసుకోవటం ఇలా..
ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tet2dsc.apcfss.in/ ను సందర్శించాలి.
- హోమ్‌పేజీలో కనిపించే 'ఏపీ టెట్ ఆన్సర్ కీ / ఫలితాలు' అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్‌పై సబ్జెక్టుల వారీగా వివరాలు ప్రత్యక్షమవుతాయి.
- మీ సబ్జెక్ట్‌ను ఎంచుకుని, చివర్లో ఉండే డౌన్‌లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఆన్సర్ కీ కాపీ పొందుపరచబడుతుంది.
- ఫైనల్ కీతో పాటు ఫలితాల రోజున మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి నేరుగా ఫలితాలను కూడా ఇదే వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
- తుది ఫలితాల కోసం వ్యక్తిగత లాగిన్ వివరాలతో లాగిన్ అయ్యాక… మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్ కాపీని పొందొచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

