TG TET Admit Card 2026 : తెలంగాణ టెట్ అడ్మిట్ కార్డ్స్ 2026 విడుదల.. డౌన్‌లోడ్ లింక్ ఇదే

TG TET Admit Card 2026 : తెలంగాణ టెట్ ఇన్‌ సర్వీస్ టీచర్స్ అడ్మిట్ కార్డ్స్ 2026 విడుదల అయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. మీకోసం డైరెక్ట్ లింక్ ఇక్కడ ఉంది.

Published on: Sep 2, 2026, 19:40:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TG TET Hall Ticket 2026 : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TG TET) 2026 ఇన్‌-సర్వీస్ టీచర్స్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. సెప్టెంబర్ 2, 2026న వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ అడ్మిట్ కార్డులను అర్హులైన అభ్యర్థులు డిపార్ట్‌మెంట్ అధికారిక పోర్టల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టీజీ టెట్ హాల్ టికెట్స్ 2026
టీజీ టెట్ హాల్ టికెట్స్ 2026

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో జరగనున్న ఈ టెట్ పరీక్షకు హాజరుకానున్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం ఇన్‌-సర్వీస్ టీచర్ల తెలంగాణ టెట్ ఆన్‌లైన్ పరీక్షలు సెప్టెంబర్ 7 నుండి సెప్టెంబర్ 11, 2026 వరకు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించడానికి హాల్ టికెట్ ప్రింట్‌అవుట్ తప్పనిసరి. చెల్లుబాటు అయ్యే అడ్మిట్ కార్డ్ లేని పక్షంలో అభ్యర్థులను ఇన్విజిలేటర్లు లోపలికి అనుమతించరు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతోపాటు అనేక రకాల సంక్షేమ విద్యా సంస్థల్లో విధుల్లో ఉన్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ప్రభుత్వ, స్థానిక సంస్థల (జడ్పీ, ఎంపీపీ) పాఠశాలల ఉపాధ్యాయులు, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TGREIS) టీచర్లు, వివిధ ప్రభుత్వ సంక్షేమ గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయులు, తెలంగాణ మోడల్ స్కూల్స్ (Model Schools) టీచర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఇతర విభాగాల పరిధిలో పనిచేస్తున్న సంబంధిత ఉపాధ్యాయులు టెట్ క్వాలిఫై కావాలి.

TG TET ఇన్‌ సర్వీస్ పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ సీబీటీ పద్ధతిలో జరుగుతుంది. ఇందులో పేపర్-1, పేపర్-2 అనే రెండు విభాగాలు ఉంటాయి. విద్యాశాఖ ముందే నిర్ణయించి విడుదల చేసిన సిలబస్ మరియు ఎగ్జామ్ పాట్రన్ ఆధారంగా అభ్యర్థులు సిద్ధం కావలసి ఉంటుంది.

టీజీ టెట్ అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

ముందుగా తెలంగాణ టెట్ అధికారిక వెబ్‌సైట్ tgtet.aptonline.in ను ఓపెన్ చేయాలి.

హోమ్‌పేజీలో కనిపించే TG TET In-Service Teachers Admit Card 2026 లింక్‌పై క్లిక్ చేయాలి.

మీ ఆధార్ నంబర్, జర్నల్ నంబర్, నమోదు చేసుకున్న మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.

సబ్మిట్ బటన్ నొక్కగానే మీ హాల్ టికెట్ పీడీఎఫ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

దానిని సేవ్ చేసుకుని, ప్రింట్‌అవుట్ తీసుకోవాలి.

హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత అభ్యర్థులు అందులోని తమ పేరు, ఫోటో, సంతకం, పరీక్ష తేదీ, సమయం, కేటాయించిన సెంటర్ అడ్రస్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. పరీక్ష రోజున హాల్‌టికెట్ కాపీతో పాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి. ఉపాధ్యాయులు ముందుగానే అడ్మిట్ కార్డులను ప్రింట్ తీసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని విద్యాశాఖ సూచించింది.

ఈ లింక్ క్లిక్ చేసి TG-TET Hall Ticket Download చేసుకోండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More