...
...
Next Story

AP TET 2026 Results : ఏపీ టెట్ ఫలితాలపై అప్డేట్ - రిజల్ట్స్ ఎప్పుడంటే..?

AP TET 2026 Results : ఏపీ టెట్ ఫలితాల విడుదలపై కసరత్తు పూర్తి కావొచ్చింది. సాంకేతిక అంశాల పరిశీలన పూర్తయ్యాక…. ఈనెల 14వ తేదీలోపే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

Published on: Sep 11, 2026, 16:22:18 IST
Advertisement

ఏపీ టెట్ ఫలితాల కోసం చాలా మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రాథమిక ఫలితాలు రాగా… తుది కీలతో పాటు ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటికే తుది ఫలితాలకు సంబంధించిన కసరత్తు పూర్తి కావొచ్చింది.

ఏపీ టెట్ ఫలితాలపై కసరత్తు
ఏపీ టెట్ ఫలితాలపై కసరత్తు

ప్రాథమిక సమాచారం మేరకు… ఈ నెల 14వ తేదీ లోపే టెట్ పరీక్షలకు సంబంధించిన కీ (Key) తో పాటు తుది ఫలితాలను కూడా వెల్లడించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. టెట్ పరీక్షల మూల్యాంకనం, మార్కుల కేటాయింపు, డేటా ప్రాసెసింగ్‌కు సంబంధించిన అన్ని రకాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.

కేవలం సాంకేతిక అంశాలను సరిచూసుకోవడం, ఫలితాల ప్రకటనలో ఎలాంటి అవాంతరాలు రాకుండా చూసుకోవడం వంటి తుది పరిశీలన పాయింట్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. ఈ సాంకేతిక పరిశీలన కూడా ఒకట్రెండు రోజుల్లో ముగిసే అవకాశం ఉంది. అంతా సవ్యంగా ఉందనుకుంటే… 14వ తేదీ లోపే కీ, ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

ఈసారి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెట్ పరీక్షలకు పెద్ద సంఖ్యలో డిఎడ్, బిఎడ్ అభ్యర్థులు హాజరయ్యారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో (DSC) టెట్ మార్కులకు వేటేజ్ ఉండటంతో ఈ ఫలితాలపై సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఫలితాలు వెలువడిన వెంటనే అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబరు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి రిజల్ట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ టెట్ ఆన్సర్ కీ, ఫలితాలు చెక్ చేసుకోవటం ఇలా..

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tet2dsc.apcfss.in / ను సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే 'ఏపీ టెట్ ఆన్సర్ కీ / ఫలితాలు' అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
  • స్క్రీన్‌పై సబ్జెక్టుల వారీగా వివరాలు ప్రత్యక్షమవుతాయి.
  • మీ సబ్జెక్ట్‌ను ఎంచుకుని, చివర్లో ఉండే డౌన్‌లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఆన్సర్ కీ కాపీ పొందుపరచబడుతుంది.
  • ఫైనల్ కీతో పాటు ఫలితాల రోజున మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి నేరుగా ఫలితాలను కూడా ఇదే వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
  • తుది ఫలితాల కోసం వ్యక్తిగత లాగిన్ వివరాలతో లాగిన్ అయ్యాక… మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్ కాపీని పొందొచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks