AP Special TET 2026 Notification : ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల - నేటి నుంచే అప్లికేషన్లు
AP Special TET 2026 Notification : ఏపీలో ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 25(నేటి) నుంచి సెప్టెంబర్ 24వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలు అక్టోబర్ 11 నుంచి ప్రారంభమవుతాయి.
AP Special TET 2026 Notification : ఆంధ్రప్రదేశ్‌లోని ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు రాష్ట్ర విద్యాశాఖ శుభవార్త అందించింది. వృత్తిలో కొనసాగుతున్న టీచర్ల కోసం ప్రత్యేకంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు నేటి (ఆగస్టు 25) నుంచి ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

ముఖ్య తేదీలు :
- ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ - ఆగస్టు 25(నేటి) నుంచి సెప్టెంబర్ 24 వరకు
- హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ - అక్టోబర్ 5 నుంచి
- టెట్ పరీక్ష తేదీలు - అక్టోబర్ 11 నుంచి 21 వరకు
- ప్రాథమిక కీ (Primary Key) విడుదల - అక్టోబర్ 24
- తుది ఫలితాల ప్రకటన - నవంబర్ 15, 2026
- అధికారిక వెబ్ సైట్ - https://tet2dsc.apcfss.in/
ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలోని బడులు, APREIS, ప్రభుత్వ సంక్షేమ గురుకులాలు, ఏపీ మోడల్ స్కూల్స్, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పని చేసే టీచర్లు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈసారి టెట్ పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానం (CBT)లో నిర్వహిస్తారు. ప్రతిరోజూ రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి.9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఉదయం సెషన్ ఉంటుంది. ఇక 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు మధ్యాహ్నం సెషన్ నిర్వహిస్తారు.
అభ్యర్థులకు దరఖాస్తు ప్రక్రియపై గానీ, పరీక్షపై గానీ ఎలాంటి సందేహాలు ఉన్నా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 8121947387, 7995649286, 6281704160 ఫోన్ నంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

