ఏపీ కేజీబీవీ జాబ్ నోటిఫికేషన్‌లో కీలక మార్పులు.. టెట్ లేకున్నా అప్లై చేసుకోవచ్చు
ఏపీ కేజీబీవీల్లో ఉద్యోగ నోటిఫికేషన్‌లో కీలక మార్పులు జరిగాయి. కేజీబీవీ జాబ్స్ దరఖాస్తును కూడా జూన్ 20వ తేదీ వరకు పొడిగించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు విద్యాశాఖ పెద్ద ఉపశమనం కలిగించింది. గతంలో విడుదల చేసిన 299 కాంట్రాక్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్‌లో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేసింది. అభ్యర్థులకు అత్యంత కీలకమైన టెట్(TET) నిబంధన నుండి తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ (SPD) బి.శ్రీనివాసరావు అధికారిక ప్రకటన విడుదల చేశారు. సవరించిన తాజా నిబంధనలు, దరఖాస్తు ప్రక్రియతో చాలా మందికి ఉపశమనం దక్కుతుంది.

సాధారణంగా కేజీబీవీల్లో ఉపాధ్యాయ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) తప్పనిసరి. అయితే తాజా సవరణ ప్రకారం ప్రస్తుతం టెట్ క్వాలిఫై కాకపోయినా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ మినహాయింపు తాత్కాలికం మాత్రమే అని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరిన రోజు నుండి ఏడాదిలోపు కచ్చితంగా ఏపీ టెట్ (AP TET) అర్హత సాధించాలి.
ఒకవేళ నిర్ణీత కాలంలోగా టెట్ అర్హత సాధించలేకపోతే, ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే వారి ఉద్యోగం నుండి తొలగిస్తారు. మే 25న విడుదలైన ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే సమయాన్ని అధికారులు జూన్ 20 వరకు పొడిగించారు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇదివరకు ఇప్పటికే అప్లై చేసుకున్న అభ్యర్థులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 299 పోస్టులను భర్తీ చేయనున్నారు. సీఆర్‌టీ(CRT)133, పీజీటీ (PGT) 98, పీఈటీ (PET)52, ప్రిన్సిపాల్స్ (Principals) 16 ఖాళీలు ఉన్నాయి.
ఈ పోస్టులకు సంబంధించిన వయోపరిమితి, విద్యార్హతలు, వేతన ప్యాకేజీ, ఇతర పూర్తి వివరాలను సమగ్ర శిక్ష అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు. ఒకవేళ ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించేటప్పుడు అభ్యర్థులకు ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే, తక్షణ సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. 70750 39990, 79933 29115 కాల్ చేయవచ్చు.
టెట్ లేదనే కారణంతో ఇంతవరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఆలస్యం చేయకుండా జూన్ 20 లోపు తమ దరఖాస్తులను సమర్పించుకోవాల్సిందిగా అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


