AP Weather Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులు, భారీ వర్షాల హెచ్చరిక!
Andhrapradesh Weather Alert : వాయువ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇవే.
Andhrapradesh Weather Alert : ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లీ వర్ష మేఘాలు కమ్ముకొస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది.ప్రజలంతా ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

భారీ వర్షాలు కురిసే జిల్లాలు:
అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో వర్షాలు తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగిలిన కోస్తాంధ్ర జిల్లాల్లో రోజంతా మేఘావృతమైన వాతావరణం నెలకొనడంతో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి.
ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారే సూచనలు ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. తీరప్రాంత ప్రజలు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వర్షాలతో పాటు పిడుగులు పడే ముప్పు ఎక్కువగా ఉన్నందున ప్రజలు తీవ్ర అప్రమత్తత పాటించాలి. ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో బయట తిరగకూడదని అధికారులు స్పష్టం చేశారు. "పిడుగులు పడే సమయంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద చెట్ల కింద, ఇనుప స్తంభాల (ఐరన్ పోల్స్) వద్ద లేదా ప్రకటనల హోర్డింగ్స్ కింద నిలబడకూడదు," అని హెచ్చరించారు. సురక్షితమైన కాంక్రీటు భవనాల లోపల మాత్రమే ఆశ్రయం పొందాలని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ కోరారు.
తక్షణ హెచ్చరిక….
రాబోయే మూడు గంటల వ్యవధిలో పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా సాలూరు, బొబ్బిలి, శృంగవరపుకోట (ఎస్.కోట), విజయనగరం పట్టణం, రాజాం పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఆయా ప్రాంతాల ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

