ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణం ఉండనుంది. రాబోయే నాలుగు రోజుల పాటు పార్వతీపురం, మన్యం, ఏఎస్ఆర్, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఎస్డీఎంఏ) తెలిపింది. మరోవైపు, రాష్ట్రంలో తీవ్రమైన వేడి, వడగాలుల పరిస్థితులు కొనసాగుతున్నాయని పేర్కొంది.

రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 76 మండలాల్లో తీవ్రమైన వడగాలుల పరిస్థితులు, మరో 134 మండలాల్లో వడగాలుల పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 తర్వాత ఉత్తరాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
గురువారం 51 మండలాల్లో తీవ్రమైన వడగాలులు, 94 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. వీటితోపాటుగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. 24, 25 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉండే అవకాశం ఉంది. మెుత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 25వ తేదీ వరకు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వర్షాలు కురిసే పరిస్థితి ఉంటుంది.
మే నెలలో రాయలసీమ
ఇక మే నెలలో రాయలసీమ ప్రాంతమంతటా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. మే నెలలో ఇవి మరో రెండు డిగ్రీలు పెరిగి 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరవచ్చని అంచనాలు ఉన్నాయి. నగరాలు, పట్టణాల నడిబొడ్డున ఉన్న బీటీ రోడ్ల వెంబడి ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలపైన వరకు కూడా చేరవచ్చు. రాయలసీమలో తరచుగా వేడి, పొడి పరిస్థితులకు దారితీస్తుందని వాతావరణ అధికారులు వివరించారు. సాధారణ సంవత్సరాలతో పోలిస్తే, రాబోయే రోజుల్లో ఈ సీజన్‌లో సగటు కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అన్నారు.
ఏప్రిల్ నెలలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇది తీవ్రమైన వేసవి పరిస్థితులు ముందుగానే ప్రారంభమవుతున్నాయని సూచిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాలం పాటు కొనసాగే వడగాలుల ప్రభావం వ్యవసాయంపై, ముఖ్యంగా అధిక వేడిని తట్టుకోలేని పంటలపై పడొచ్చు.
{{/usCountry}}ఏప్రిల్ నెలలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇది తీవ్రమైన వేసవి పరిస్థితులు ముందుగానే ప్రారంభమవుతున్నాయని సూచిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాలం పాటు కొనసాగే వడగాలుల ప్రభావం వ్యవసాయంపై, ముఖ్యంగా అధిక వేడిని తట్టుకోలేని పంటలపై పడొచ్చు.
{{/usCountry}}