AP Heatwave : ఏపీలో సుర్రుమనిపిస్తున్న సూరీడు.. 64 మండలాల్లో వడగాలులు!

AP Heatwave : ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మే 2వ తేదీన 64 మండలాల్లో వడగాలుల పరిస్థితులు ఉంటాయని విపత్త నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

Published on: May 2, 2026, 09:35:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. శుక్రవారం నాడు కూడా తీవ్రమైన ఎండ వేడిమి ఉంది. రాష్ట్రంలోనే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతగా పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో 45.9 డిగ్రీలుగా నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రకార్ జైన్ తెలిపారు. 20 జిల్లాల్లోని 252 మండలాల్లో తీవ్రమైన వేడి పరిస్థితులు నెలకొన్నాయని, ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత స్థాయి 41 డిగ్రీలు దాటిందని జైన్ పేర్కొన్నారు.

ఏపీ వెదర్ న్యూస్
ఏపీ వెదర్ న్యూస్

శనివారం నాడు విజయనగరం (8), పార్వతీపురం-మన్యం (10), పోలవరం (2), ఎన్టీఆర్ (1), గుంటూరు (1), పల్నాడు (19), మార్కాపురం (6), ప్రకాశం (10), నెల్లూరు (3), తిరుపతి (4) జిల్లాలతో సహా మొత్తం 64 మండలాల్లో వడగాలుల పరిస్థితులు ఉంటాయని అధికారులు అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

తీవ్రమైన వేడి, అధిక తేమ నుండి రక్షణ పొందేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల్లో నెల్లూరు జిల్లాలోని గూడూరు 45.5 డిగ్రీలతో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి, ఎన్టీఆర్ జిల్లాలోని తోర్రగూడిపాడు 45.1 డిగ్రీలు, ప్రకాశం జిల్లాలోని అద్దంకి 44.6 డిగ్రీలు, ఏలూరు జిల్లాలోని అల్లిపల్లి, మార్కాపురం జిల్లాలోని పెదచెర్లోపల్లి 44.5డిగ్రీలు, తిరుపతి జిల్లాలోని వెంకటగిరి 44.4 డిగ్రీలు, గుంటూరు జిల్లాలోని చేబ్రోలు 44.1 డిగ్రీలు, బాపట్ల జిల్లాలోని కారంచేడు 44 డిగ్రీలుగా నమోదయ్యాయి.

నంద్యాల జిల్లాలోని సంజామల, వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొడూరులో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో పోలవరం జిల్లాలోని కునవరం 42.6 డిగ్రీలు, చిత్తూరు జిల్లాలోని తవనంపల్లె, విశాఖపట్నం జిల్లాలోని ములగడ 42.4 డిగ్రీలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా దక్షిణ ఒడిశా నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా మన్నార్ సింధుశాఖ వరకు విస్తరించి ఉన్న ఒక ద్రోణి, రాబోయే కొద్ది రోజుల పాటు వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావం వల్ల శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆదివారం, సోమవారం కొన్ని జిల్లాల్లో మేఘావృత వాతావరణం, ఈదురు గాలులు, చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వేడి తీవ్రత కొద్దిగా తగ్గే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ సూచించింది. మెరుపుల ప్రమాదం ఉన్నందున ఉరుములతో కూడిన వర్షాల సమయంలో రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు హెచ్చరించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More