ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఓ వైపు ఎండ.. మరోవైపు ఆకస్మాత్తుగా వాతావరణం మారి వర్షం పడింది. జనాలకు ఎండ నుంచి ఉపశమనం దక్కింది. బుధవారం సాయంత్రం విజయవాడ, అమరావతి, పరిసర ప్రాంతాల్లో మెరుపులు, ఈదురు గాలులు, ఉరుములతో కూడిన ఆకస్మిక వర్షం కురిసింది. తీవ్రమైన వేడి నుండి జనాలకు ఉపశమనం కలిగించింది.

మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు మూడు గంటల పాటు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మెరుపులతో కూడిన తీవ్రమైన ఉరుములు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, భారీ వర్షపాతం కురిసే అవకాశం చాలా ఎక్కువగా ఉందని హెచ్చరించింది. వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలో పేర్కొంది. ప్రకాశం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లాకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఎస్‌డీఎంఏ) అధికారులు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జిల్లాలో అమరావతి చుట్టుపక్కల కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసినప్పటికీ, వడగళ్ల వాన పడలేదని తెలిపారు. ఐఎండీ అంచనా ప్రకారం, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాల్లోని అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, తేలికపాటి జల్లులు కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రంలో మార్చి 22 వరకు గంటకు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ఒకవైపు తీవ్రమైన వేడి, మరోవైపు ఉరుములు, మెరుపులతో కూడిన మిశ్రమ వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా కోస్తా జిల్లాల్లో, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయి. గంటకు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చు.
{{/usCountry}}ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా కోస్తా జిల్లాల్లో, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయి. గంటకు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చు.
{{/usCountry}}మార్చి 21వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఉరుములు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.