...
...
Next Story

AP BRAGCET Seat Allotment 2026 : ఏపీ గురుకుల సీట్ల కేటాయింపు - అలాట్‌మెంట్ కాపీని ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP BRAGCET Seat Allotment 2026 : డా.బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో ప్రవేశాలకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. 5వ తరగతి ఎంట్రెన్స్ ఫలితాలు ఇప్పటికే రాగా.. తాజాగా సీట్లను కేటాయించారు. apbragcet.apcfss.in వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవాలి.

Published on: Apr 9, 2026, 19:04:58 IST
Advertisement

ఏపీలోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో అడ్మిషన్ల ప్రక్రియపై కొత్త అప్డేట్ వచ్చేసింది. ఐదో తరగతితో పాటు జూనియర్ ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే తాజాగా 5వ తరగతి సీట్లను కేటాయించారు. విద్యార్థులు సాధించిన స్కోర్, ర్యాంకుల ఆధారంగానే వీటిని కేటాయించినట్లు అధికారులు ప్రకటించారు.

ఏపీ గురుకుల ఎంట్రెన్స్ (istock image)
ఏపీ గురుకుల ఎంట్రెన్స్ (istock image)

మార్చి 1వ తేదీన ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎంట్రెన్స్ ద్వారా అర్హత సాధించిన విద్యార్థులకు 5వ తరగతిలో అడ్మిషన్లు కల్పిస్తారు. ఇందుకు సంబంధించి అలాట్ మెంట్ కాపీలను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

AP BRAGCET 2026 - అలాట్ మెంట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

  1. ముందుగా https://apbragcet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోంపేజీలోని క్యాండెట్ లాగిన్ ఉంటుంది.
  3. ఇక్కడ మీ వివరాలను నమోదు చేసి లాగిన్ కావాలి.
  4. మీకు సీటు కేటాయింపు వివరాలు ఇక్కడ డిస్ ప్లే అవుతాయి.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి అలాట్ మెంట్ కాపీని పొందొచ్చు.
  6. అడ్మిషన్ ప్రాసెస్ లో అలాట్ మెంట్ చాలా కీలకం. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి.

ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో విద్యార్థులు సాధించే స్కోర్, ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయించారు. సకాలంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. గత కొంతకాలంగా గురుకుల సీట్ల కోసం తెగ డిమాండ్ ఉంటోంది. చాలా మంది తల్లిదండ్రులు… వారి పిల్లలను గురుకులాల్లో చేర్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks