AP BRAGCET Result : 6 - 10వ తరగతి ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల - ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

AP BRAGCET Results 2026 : డా.బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో ప్రవేశాల ఫలితాలకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. బ్యాక్ లాగ్ తో పాటు ఇంటర్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫలితాలు కూడా  విడుదలయ్యాయి. apbragcet.apcfss.in వెబ్ సైట్ నుంచి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలి.

Published on: Apr 4, 2026, 11:17:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో అడ్మిషన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ పై మరో అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఐదో తరగతితో పాటు జూనియర్ ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా 6,7,8,9, 10వ తరగతి బ్యాక్ లాగ్ తో పాటు ఐఐటీ, నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫలితాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

AP BRAGCET ఫలితాలు (image source istock)
AP BRAGCET ఫలితాలు (image source istock)

మార్చి 1వ తేదీన ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎంట్రెన్స్ ద్వారా అర్హత సాధించిన విద్యార్థులకు 6,7,8,9,10వ తరగతిలో సీట్లను కేటాయిస్తారు. అంతేకాకుండా ఐఐటీ, నీట్ పరీక్షలు రాసి క్వాలిఫై అయిన వారికి ఉచితంగా కోచింగ్ ఇస్తారు. ఇందుకు సంబంధించి ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

AP BRAGCET 2026 ఫలితాలు - ర్యాంక్ కార్డు డౌన్లోడ్ ఇలా

  • ముందుగా https://apbragcet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలోని 6 నుంచి 10వ తరగతి పరీక్ష, ఐఐటీ, నీట్ ఆప్షన్లు ఉంటాయి.
  • ఆయా ఆప్షన్ల కింద ఉండే ఫలితాల లింక్ పైక్లిక్ చేయాలి.
  • ఇక్కడ విద్యార్థి ఐడీ, పుట్టిన తేదీ వివరాలతో పాటు క్యాప్చాను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ చేస్తే విద్యార్థి స్కోర్, ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ప్రాథమిక కీ కాపీని పొందొచ్చు.
  • అడ్మిషన్ ప్రాసెస్ లో ర్యాంక్ కార్డు చాలా కీలకం. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి.

AP BRAGCET ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో విద్యార్థులు సాధించే స్కోర్, ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు. గత కొంతకాలంగా గురుకుల సీట్ల కోసం తెగ డిమాండ్ ఉంటోంది. చాలా మంది తల్లిదండ్రులు… వారి పిల్లలను గురుకులాల్లో చేర్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇటీవలనే 5వ తరగతితో పాటు జూనియర్ ఇంటర్ ప్రవేశాల ఫలితాలు విడుదలయ్యాయి. వీటికి సంబంధించి త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. విడతల వారీగా సీట్లను భర్తీ చేస్తారు. సీట్లు పొందే విద్యార్థులు… ఆయా స్కూళ్లు, కాలేజీల్లో రిపోర్టింగ్ చేస్తేనే సీటు కన్ఫర్మ్ అవుతుంది. లేకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. ఈ ప్రవేశాలకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకునేందుకు https://apbragcet.apcfss.in/ వెబ్ సైట్ ను చూస్తూ ఉండాలి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More