AP BRAGCET Result 2026 : ఏపీ గురుకుల ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల - ర్యాంక్ కార్డు ఇలా చెక్ చేయండి
AP BRAGCET Results 2026 : డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. apbragcet.apcfss.in వెబ్ సైట్ నుంచి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలి.
ఏపీలోని డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో అడ్మిషన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ పై మరో అప్డేట్ వచ్చేసింది. ఐదో తరగతితో పాటు జూనియర్ ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 6,7,8వ తరగతి బ్యాక్ లాగ్ ప్రవేశాల ఫలితాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

మార్చి 1వ తేదీన ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎంట్రెన్స్ ద్వారా అర్హత సాధించిన విద్యార్థులకు 5వ తరగతి, జూనియర్ ఇంటర్(ఫస్ట్ ఇయర్)లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకు సంబంధించి ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
AP BRAGCET 2026 ఫలితాలు - ర్యాంక్ కార్డు డౌన్లోడ్ ఇలా
- ముందుగా https://apbragcet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలోని 5వ తరగతితో పాటు 6 నుంచి 10వ తరగతి పరీక్ష, ఇంటర్ ప్రవేశ పరీక్ష ఆప్షన్లు ఉంటాయి.
- ఆయా ఆప్షన్ల కింద ఉండే ఫలితాల లింక్ పైక్లిక్ చేయాలి.
- ఇక్కడ విద్యార్థి ఐడీ, పుట్టిన తేదీ వివరాలతో పాటు క్యాప్చాను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ చేస్తే విద్యార్థి స్కోర్, ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ప్రాథమిక కీ కాపీని పొందొచ్చు.
- అడ్మిషన్ ప్రాసెస్ లో ర్యాంక్ కార్డు చాలా కీలకం. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి.
ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో విద్యార్థులు సాధించే స్కోర్, ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు. గత కొంతకాలంగా గురుకుల సీట్ల కోసం తెగ డిమాండ్ ఉంటోంది. చాలా మంది తల్లిదండ్రులు… వారి పిల్లలను గురుకులాల్లో చేర్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
5వ తరగతి, జూనియర్ ఇంటర్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో… త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ను కూడా ఖరారు చేసే అవకాశాలుంటాయి. ర్యాంకుల ఆధారంగా…. సీట్ల కేటాయింపు ఉంటుంది. తదితర అప్డేట్స్ కోసం https://apbragcet.apcfss.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

