APCOB Recruitment 2026 : ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు - ఇలా దరఖాస్తు చేసుకోండి

APCOB Faculty Recruitment 2026 : విజయవాడలోని ఆప్కాబ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Oct 11, 2026, 07:33:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ పరిధిలోని విజయవాడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ (CTI) లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. శిక్షణ ఇచ్చే ఆసక్తి, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన నిపుణత ఉన్న అనుభవజ్ఞులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని బ్యాంక్ వర్గాలు సూచించాయి.

ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

ఖాళీలు - అర్హతలు ఇలా…

ఆప్కాబ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో మొత్తం 2 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రాథమికంగా 3 సంవత్సరాల కాలపరిమితికి కాంట్రాక్ట్ నియమాకం ఉంటుంది. ప్రతి సంవత్సరం వారి పనితీరును సమీక్షించి కాంట్రాక్ట్‌ను కొనసాగిస్తారు.

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీతో పాటు CAIIB ఉత్తీర్ణత లేదా డిప్లొమా ఇన్ కోఆపరేటివ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసి ఉండాలి. లేదా కామర్స్ / ఎంబీఏ / అగ్రికల్చర్ / కోఆపరేటివ్స్, బ్యాంకింగ్, ఎన్‌పీఏ అండ్ రికవరీ మేనేజ్‌మెంట్, క్రెడిట్ అప్రైజల్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రెజరీ మేనేజ్‌మెంట్‌లో పీజీ విద్యార్హత కలిగిన వారు అర్హులు.

కంప్యూటర్, మల్టీమీడియా టూల్స్ మరియు ఆధునిక బోధనా పద్ధతులపై అవగాహన ఉండటం తప్పనిసరి. అభ్యర్థులకు తెలుగు భాషలో బోధించే నైపుణ్యం కచ్చితంగా ఉండాలి. బ్యాంకింగ్, లోనింగ్, సహకార రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో మంచి అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. పదవీ విరమణ పొందిన అధికారులైతే స్కేల్-IV లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో కనీసం స్కేల్-II క్యాడర్‌లో 8 సంవత్సరాల అనుభవంతో రిటైర్ అయి ఉండాలి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల మధ్య ఉండాలి. పదవీ విరమణ చేసిన ఆఫీసర్లకు గరిష్ట వయోపరిమితి 65 ఏళ్ల వరకు ఉంటుంది. ఎంపికైన రిటైర్డ్ అధికారులకు నెలకు రూ. 70,000 స్థిర వేతనంతో పాటు నెలకు రూ. 5,000 కాన్వేయన్స్ అలవెన్స్ చెల్లిస్తారు. ఇన్-సర్వీస్ అభ్యర్థులకు పే ప్రొటెక్షన్ మరియు డెప్యూటేషన్ / ఫ్యాకల్టీ అలవెన్సులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం….

అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాన్ని ఆఫ్‌లైన్ విధానంలో నింపి, విద్యార్హతలు, వయస్సు, అనుభవ పత్రాల నకళ్లతో పాటు రూ. 1000 దరఖాస్తు రుసుమును “ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్”పేరుతో విజయవాడలో చెల్లుబాటయ్యేలా డిమాండ్ డ్రాఫ్ట్ లేదా NEFT/IMPS/UPI విధానంలో చెల్లించి జతచేయాలి.

పూర్తి చేసిన దరఖాస్తులను "ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌, ఎన్‌టీఆర్‌ సహాకారా భవన్‌ గవర్నర్‌పేట్‌, విజయవాడ -520002 చిరునామాకు పంపించాలి. అక్టోబర్ 14, 2026 నాటికి అందేలా పోస్ట్ ద్వారా లేదా నేరుగా పంపించాలి. దరఖాస్తు కవరుపై "APPLICATION FOR THE POST OF FACULTY FOR APCOB CTI- CONTRACTUAL BASIS" అని స్పష్టంగా రాయాలి. అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ చేసి ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More