...
...
Next Story

APCOB Recruitment : విజయవాడ కోఆపరేటివ్‌ బ్యాంకులో అప్రెంటిస్‌ ఉద్యోగాలు - ఎగ్జామ్ లేకుండానే..! దరఖాస్తు తేదీలివే

APCOB Apprentice Recruitment 2026 : విజయవాడలోని ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లోని పలు విభాగాల్లో 25 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి.

Published on: Aug 8, 2026, 14:56:20 IST
Advertisement

APCOB Apprentice Recruitment 2026 : బ్యాంకింగ్ రంగంలో తమ వృత్తిపరమైన ప్రస్థానాన్ని ప్రారంభించాలనుకునే యువతకు విజయవాడ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB) మంచి అవకాశం కల్పించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఏడాది కాలపరిమితితో వివిధ విభాగాల్లో మొత్తం 25 అప్రెంటిస్ స్థానాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

25 అప్రెంటిస్ పోస్టులు
25 అప్రెంటిస్ పోస్టులు

మొత్తం ఉన్న 25 అప్రెంటిస్ ఖాళీలలో 7 పోస్టులను ప్రత్యేక విభాగాలుగా…. మిగిలిన 18 పోస్టులను జనరల్ కేటగిరీగా వర్గీకరించారు.

  • అగ్రికల్చర్ (వ్యవసాయం) : 03 పోస్టులు
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) : 03 పోస్టులు
  • లీగల్ (న్యాయ విభాగం) : 01 పోస్టు
  • జనరల్ : 18 పోస్టులు

విద్యార్హతలు…

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసి ఉండాలి. అగ్రికల్చర్ పోస్టులకు వ్యవసాయం/హార్టికల్చర్/వెటర్నరీ, ఐటీ పోస్టులకు కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఈసీఈ, లీగల్ పోస్టులకు లా (LLB), జనరల్ పోస్టులకు బ్యాంకింగ్/కామర్స్/అకౌంటింగ్‌లలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. దీనితో పాటు అభ్యర్థులకు తెలుగు, ఇంగ్లీష్ భాషలలో చదవడం, రాయడంలో మంచి ప్రావీణ్యం ఉండటం తప్పనిసరి. 10వ లేదా 12వ తరగతిలో స్థానిక భాష చదవని వారికి పత్రాల పరిశీలన సమయంలో స్థానిక భాషా పరీక్ష నిర్వహిస్తారు.

ఆగస్టు 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 20 ఏళ్లు నిండి ఉండాలి, గరిష్ఠంగా 28 ఏళ్లకు మించకూడదు. అంటే అభ్యర్థులు 01.08.1998 నుండి 01.08.2004 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు కొన్ని మినహాయింపులు వర్తిస్తాయి.

ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు పదో తరగతి , ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్లలో సాధించిన మార్కుల మెరిట్ (వెయిటేజీ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా కేంద్ర ప్రభుత్వ నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS 2.0) పోర్టల్‌ (www.nats.education.gov.in) లో 100 శాతం ప్రొఫైల్ పూర్తి చేసి నమోదు చేసుకోవాలి.

ఆ తర్వాత అప్కోబ్ అధికారిక వెబ్‌సైట్ (www.apcob.bank.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేయాలి. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 11, 2026. దరఖాస్తుల పరిశీలన అనంతరం విజయవాడలోని అప్కోబ్ ప్రధాన కార్యాలయంలో పత్రాల పరిశీలన నిర్వహిస్తారు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe