AP HC Recruitment 2026 : ఏపీ హైకోర్టులో లా క్లర్క్ ఉద్యోగాలు - దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలు
AP High Court Law Clerk Recruitment 2026 : ఏపీ హైకోర్టులో కాంట్రాక్ట్ ప్రాతిపదికన లా క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు 2026 ఆగస్టు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
AP High Court Law Clerk Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కాంట్రాక్ట్ ప్రాతిపదికన లా క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు 2026 ఆగస్టు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా వీటిని సమర్పించాలి. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.

న్యాయ విద్యను అభ్యసించిన అభ్యర్థులకు హైకోర్టు న్యాయమూర్తుల వద్ద పనిచేసేందుకు, న్యాయపరమైన పరిశోధనల్లో భాగస్వామ్యమయ్యేందుకు ఈ లా క్లర్క్ పోస్టులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన వయోపరిమితి, విద్యార్హతలు, ఎంపిక ప్రక్రియ, వేతనం, ఇతర పూర్తి నిబంధనల వివరాల కోసం అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ముఖ్య వివరాలు :
- మొత్తం 4 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పరిస్థితులు, అవసరాలను బట్టి ఈ ఖాళీల సంఖ్య పెరిగే లేదా తగ్గే అవకాశం ఉందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారతీయ పౌరుడై ఉండాలి. వయస్సు 30 సంవత్సరాలు దాటకూడదు.
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 10+2 తర్వాత 5 సంవత్సరాల లా కోర్సు లేదా ఏదైనా డిగ్రీ తర్వాత 3 సంవత్సరాల రెగ్యులర్ లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. నోటిఫికేషన్ వెలువడిన తేదీకి ముందు గత 2 ఏళ్లలోపు లా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
- ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా విధుల్లో చేరేనాటికి లా అర్హత పత్రాలు సమర్పించే నిబంధనతో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఒకవేళ అడ్వొకేట్‌గా నమోదు చేసుకుంటే, ఈ నియామకం పూర్తయ్యే వరకు ప్రాక్టీస్‌ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి ఉంటుంది.
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000 వేతనం ఉంటుంది .
- అభ్యర్థుల ఎంపిక కేవలం ప్రతిభ ఆధారంగానే జరుగుతుంది. వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం, అమరావతిలో జరిగే ముఖాముఖి ద్వారా ఎంపిక చేస్తారు.
- నియామక కాలపరిమితి సాధారణంగా ఒక సంవత్సరం ఉంటుంది. ప్రదర్శన ఆధారంగా గౌరవ ప్రధాన న్యాయమూర్తి అనుమతితో దీనిని గరిష్టంగా 4 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.
- ఎంపికైన లా క్లర్క్‌లు కేస్ ఫైళ్లను చదవడం, కేస్ నోట్స్, సమరీ తయారు చేయడం, న్యాయపరమైన పరిశోధనలు చేయడం వంటి బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం ఇలా…
ఆసక్తి కలిగిన అభ్యర్థులు హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ ( https://aphc.gov.in/ ) నుంచి నిర్ణీత నమూనా అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. నింపిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు వయస్సు, విద్యార్హతల ధృవీకరణ పత్రాల ద్రువీకృత నకళ్లను (Attested Copies) జతచేయాలి. పోస్టల్ కవర్ పైన "Application for the post of Law Clerk" అని స్పష్టంగా రాసి, "రిజిస్టర్డ్ పోస్ట్" లేదా "స్పీడ్ పోస్ట్" ద్వారా మాత్రమే పంపించాలి.
- దరఖాస్తు పంపాల్సిన చిరునామా - చిరునామా: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా – 522239.
- 2026 ఆగస్టు 04 సాయంత్రం 5:00 గంటల వరకు. గడువు ముగిసిన తర్వాత లేదా అసంపూర్తిగా వచ్చిన దరఖాస్తులను తిరస్కరిస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://aphc.gov.in/
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

