...
...
Next Story

అమరావతి మాస్టర్ ప్లాన్.. రోడ్ల నెట్‌వర్క్ కోసం సీఆర్‌డీఏ గ్రామ సభలు!

అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ స్థాయి రవాణా, అనుసంధాన ప్రణాళికలను రూపొందించేందుకు సీఆర్డీఏ రాజధాని పరిధిలోని గ్రామాల్లో గ్రామ సభలను ప్రారంభించింది. రోడ్ల నెట్‌వర్క్ గురించి స్థానిక ప్రజలకు అవగాహన కల్పించడం, అలాగే తుది నిర్ణయాలు తీసుకునే ముందు వారి నుంచి సూచనలు సేకరిస్తారు.

Published on: Aug 4, 2026, 14:10:24 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) మరొక కీలక ముందడుగు వేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రాజధాని పరిధిలోని గ్రామాల రవాణా వ్యవస్థ, అనుసంధాన ప్రణాళికలను రూపొందించేందుకు సీఆర్‌డీఏ గ్రామ సభలను అధికారికంగా ప్రారంభించింది.

అమరావతి
అమరావతి

రాజధాని పరిధిలోని నార్త్-వెస్ట్ గ్రిడ్ పరిధిలో ఉన్న అబ్బరాజుపాలెం, రాయపూడి గ్రామాల్లో మెుదటి గ్రామ సభలను నిర్వహించారు.

అమరావతి బృహత్ ప్రణాళిక ప్రకారం రాజధాని నగరంతో స్థానిక గ్రామాలను ఏ విధంగా అనుసంధానించాలి, గ్రామీణ రహదారుల నెట్‌వర్క్‌ను ఎలా అభివృద్ధి చేయాలి అనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ సమావేశాల ప్రధాన లక్ష్యం.

ప్రతిపాదిత రహదారుల నెట్‌వర్క్, గ్రామాల విలీనం, రహదారుల వెడల్పు ప్రక్రియలపై స్థానిక నివాసితులకు సీఆర్‌డీఏ అధికారులు మ్యాప్‌ల ద్వారా సమగ్రంగా వివరించారు. ఫైనల్ ప్రణాళికలను ఖరారు చేయడానికి ముందు రైతులు, స్థానిక ప్రజల నుండి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించారు.

మాస్టర్ ప్లాన్ అమలులో స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్చేందుకు ఈ రకమైన సంప్రదింపులు దోహదపడతాయని అధికారులు తెలిపారు. రాజధాని అమరావతి పనులను వేగవంతం చేయడంలో భాగంగా పటిష్టమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగానే రాజధాని అంతర్గత రహదారులు, ప్రధాన ట్రంక్ రోడ్లు, గ్రామీణ రహదారుల సమగ్ర అనుసంధానానికి ఈ విలేజ్ సర్క్యులేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ప్లాన్ ఎంతో కీలకం కానుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe