APCRDA Recruitment 2026 : ఏపీసీఆర్డీఏ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - రూ.61 వేల జీతం, దరఖాస్తు తేదీలు
APCRDA Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 07గా నిర్ణయించారు.
APCRDA Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. మరోవైపు APCRDA (ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ)ను బలోపేతం చేసేందుకు పలు పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. ఇందులో భాగంగా సంస్థలోని లీగల్ విభాగంలో సేవలు అందించేందుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ - పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

- అసిస్టెంట్ మేనేజర్ - లీగల్
- మొత్తం ఖాళీలు: 04
- పనిచేయాల్సిన ప్రదేశం : APCRDA ప్రాజెక్ట్ ఆఫీస్, రాయపూడి పోస్ట్, తుళ్లూరు మండలం, అమరావతి, గుంటూరు జిల్లా.
- ఒప్పంద కాలపరిమితి: ఏడాది కాలపరిమితితో ఈ కాంట్రాక్ట్ నియామకం ఉంటుంది.
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి చట్టంలో బ్యాచిలర్ డిగ్రీ లా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు లా పూర్తి చేసిన తర్వాత కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండటం తప్పనిసరి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చట్టాలు, ఏపీ సీఆర్‌డీఏ చట్టం 2014, ల్యాండ్ పూలింగ్ విధానం, భూసేకరణ చట్టం (RFCTLARR Act, 2013), కంపెనీల చట్టం 2013, కాంట్రాక్ట్ చట్టాలు, ఆర్బిట్రేషన్ అండ్ కాన్సిలియేషన్ చట్టం 1996, లేబర్ చట్టాలు, రేరా (RERA) చట్టం 2016, పర్యావరణ చట్టాలు మరియు సివిల్ ప్రొసీజర్ కోడ్‌పై అవగాహన, అనుభవం ఉండాలి.
అభ్యర్థులు ఇప్పటివరకు న్యాయస్థానాల్లో నిర్వహించిన కేసుల వివరాలను ఏడాదివారీగా దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, పీపీపీ ఒప్పందాల వ్యవహారాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.61,960 వేతనం చెల్లిస్తారు.
అమరావతి రాజధాని నగరం, దాని అనుబంధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో లీగల్ విభాగానికి సహాయకారిగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాంట్రాక్టులు, ఒప్పందాల ముసాయిదా తయారీ, భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS) వివాదాల పరిష్కారం, హైకోర్టు, ఇతర న్యాయస్థానాల లీగల్ పిటిషన్ల తయారీ, భూముల డాక్యుమెంట్ల పరిశీలన వంటి బాధ్యతలను నిర్వహించాలి.
- దరఖాస్తు ప్రారంభం : 25 ఆగస్టు 2026
- దరఖాస్తుకు చివరి తేదీ: 07 సెప్టెంబర్ 2026
అభ్యర్థులు APCRDA అధికారిక వెబ్‌సైట్ https://crda.ap.gov.in లోని "Careers" ట్యాబ్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇతర మార్గాల్లో పంపే దరఖాస్తులను స్వీకరించరు. సందేహాలు ఏవైనా ఉంటే పనివేళల్లో (ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు) 0863-2000253 నంబర్‌ను లేదా recruitment@apcrda.org ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని APCRDA కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్ వెల్లడించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

