APMSRB Recruitment Notification 2026 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ ఖాళీలున్నాయి. అన్ని ఉద్యోగాలు కలిపి 529 ఉండగా… ఈ పోస్టులకు ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు రేపటితో (జూన్ 30) ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు… వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
మొత్తం 529 ఖాళీలు - వివరాలు :
- స్టాఫ్ నర్స్ : మొత్తం 419 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 27,675 వేతనం అందిస్తారు. అభ్యర్థులు బీఎస్‌సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (GNM) కోర్సు పూర్తి చేసి… ఏపీ నర్సింగ్ కౌన్సిల్ (APNMC)లో తాజాగా నూతనీకరించిన రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
- ఫార్మసిస్ట్ : మొత్తం 24 ఖాళీలు ఉన్నాయి. వీరికి నెలకు రూ. 23,393 వేతనం లభిస్తుంది. అభ్యర్థులు డి.ఫార్మా లేదా బి.ఫార్మా లేదా ప్రభుత్వం గుర్తించిన ఇంటర్మీడియట్ వోకేషనల్ ఫార్మసీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
- మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్) : మొత్తం 86 ఖాళీలు ఉన్నాయి. వీరికి నెలకు రూ. 23,494 వేతనం చెల్లిస్తారు. ఇంటర్మీడియట్ విద్యతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏడాదిన్నర కాలపరిమితి గల మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి, ఆర్సీఐ చట్టం-1992 (RCI Act) కింద రిజిస్టర్ అయి ఉండాలి.

{{^htLoading}} {{/htLoading}}
ఈ పోస్టుల భర్తీకి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు. పూర్తిగా మెరిట్, ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనల ఆధారంగానే ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు గాను సెలక్షన్ లిస్ట్ సిద్ధం చేస్తారు.
దరఖాస్తు విధానం ఇలా:
- అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://apmsrb.ap.gov.in/msrb/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 30, 2026 (రాత్రి 11:59 గంటల వరకు).
- దరఖాస్తు రుసుము : ఓపెన్ కాంపిటీషన్ (OC) అభ్యర్థులు రూ. 1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ (EWS) మరియు దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 900 గా నిర్ణయించారు. రుసుమును ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
- సాంకేతిక సమస్యలు ఎదురైతే పనిదినాల్లో ఉదయం 11:00 నుండి సాయంత్రం 4:00 గంటల మధ్య 94926 19809 నంబర్‌ను సంప్రదించవచ్చు.
- అధికారిక వెబ్ సైట్ - https://apmsrb.ap.gov.in/msrb/
ఈ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}