APMSRB Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (DSH) నియంత్రణలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేయడానికి 47 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

{{^htLoading}} {{/htLoading}}
ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 3వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను 2026 జూన్ 17వ తేదీ రాత్రి 11:59 గంటలలోపు ఆన్‌లైన్ ద్వారా సమర్పించవచ్చు. https://apmsrb.ap.gov.in/msrb వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫీజు చెల్లింపుతో పాటు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు :
- మొత్తం 47 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులలో పాత నోటిఫికేషన్ల బ్యాక్‌లాగ్ ఖాళీలతో పాటు రెగ్యులర్ ఖాళీలు కూడా కలిసి ఉన్నాయి. ఇందులోనూ ఓపెన్ కేటగిరీ కింద 18 ఖాళీలున్నాయి.
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఎంబీబీఎస్ (MBBS) లేదా ఎండీఎస్ (MDS) బేసిక్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు తప్పనిసరి విద్యార్హతగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి.
- మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రులలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా హెల్త్ సెక్టార్ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌లో కనీసం 2 ఏళ్ల అనుభవం ఉండాలి. వీటితో పాటు గుర్తింపు పొందిన సంస్థలలో అడ్మినిస్ట్రేషన్ లేదా లీడర్‌షిప్ లేదా మేనేజర్ రోల్స్‌లో కనీసం ఒక ఏడాది పని చేసిన అనుభవం ఉండాలి. అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలని నోటిఫికేషన్ లో ప్రస్తావించారు.
- అభ్యర్థుల వయస్సు 2025 జూలై 1 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపులు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు (గరిష్ట వయస్సు 47 ఏళ్లు), దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు (గరిష్ట వయస్సు 52 ఏళ్లు) ఇచ్చారు. ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు వారి సేవ కాలంతో పాటు అదనంగా 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెలా రూ.80,000 చొప్పున స్థిర వేతనం (రెమ్యూనరేషన్) అందిస్తారు.
- అభ్యర్థుల ఎంపికను ప్రక్రియను 100 మార్కుల వెయిటేజీ ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపంలో నిర్వహిస్తారు. ఎంబీబీఎస్/ఎండీఎస్ మార్కులకు గరిష్టంగా 45 మార్కులు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్ డిగ్రీ/ఎంబీఏ మార్కులకు గరిష్టంగా 30 మార్కులు అభ్యర్థి డిగ్రీ పాసైన సంవత్సరం ఆధారంగా (సీనియారిటీ)కి గరిష్టంగా 10 మార్కులు కేటాయిస్తారు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్‌గా చేసిన కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజీకి గరిష్టంగా 15 మార్కులుంటాయి.
- దరఖాస్తు ఫీజు కింద ఓపెన్ కేటగిరీ (OC) అభ్యర్థులకు రూ.1500 ఎస్సీగా నిర్ణయించారు. ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి.
- అధికారిక వెబ్ సైట్ - https://apmsrb.ap.gov.in/msrb/
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}