IIT Tirupati Apprentice : ఐఐటీ తిరుపతిలో 40 అప్రెంటిస్‌ ఖాళీలు - ఈ తేదీల్లో ఇంటర్వ్యూలు

IIT Tirupati Apprenticeship 2026 : ఐఐటీ తిరుపతి నుంచి అప్రెంటిస్‌ నోటిఫికేషన్ జారీ అయింది. అర్హత గల అభ్యర్థులు ఈనెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.

Published on: Mar 22, 2026, 06:02:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియన్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి నుంచి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.డిప్లొమా, డిగ్రీ, జీఎన్‌ఎం, బీఈ/బీటెక్‌, బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు 26 ఉండగా(15 విభాగాలు)... డిప్లొమా అప్రెంటిస్‌ ఖాళీలు 14గా(8 విభాగాలు) ఉన్నాయి.

ఐఐటీ తిరుపతిలో 40 అప్రెంటిస్‌ ఖాళీలు
ఐఐటీ తిరుపతిలో 40 అప్రెంటిస్‌ ఖాళీలు

ఈ తేదీల్లో ఇంటర్వ్యూలు…

అర్హత గల అభ్యర్థులు మార్చి 27, 28, 29 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఎంపికైన గ్రాడ్యూయేట్ అప్రెంటిస్ కు నెలకు రూ. 20 వేల స్టైఫండ్ ఇస్తారు. డిప్లొమా అప్రెంటిస్‌ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 18వేల స్టైఫండ్ చెల్లిస్తారు.

ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. పోస్టులను బట్టి ఇంటర్వ్యూ తేదీలను ఖరారు చేశారు. https://www.iittp.ac.in/ వెబ్ సైట్ లో ఇందుకు సంబంధించిన వివరాలను పేర్కొన్నారు. ఇక ఇంటర్వ్యూకి వచ్చే అభ్యర్థులు కింద సూచించిన ధ్రువపత్రాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది.

  • టెన్త్ మెమో
  • డిగ్రీ మెమో
  • డిగ్రీ ప్రొవిజనల్ మెమో
  • కుల ధ్రువీకరణపత్రం
  • ఈడబ్యూఎస్ అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రం
  • దివ్యాంగ అభ్యర్థులు అయితే సంబంధిత ధ్రువపత్రం
  • పాన్, ఓటర్ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన కార్డు
  • ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్
  • మెడికల్ ఫిటెన్నెస్ సర్టిఫికెట్
  • 2 పాస్ ఫొటోలు

ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను చెక్ చేసుకోవచ్చు

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More