APPGCET 2026 హాల్ టికెట్లు విడుదల - మే 8 నుంచి పరీక్షలు, సబ్జెక్టులవారీగా పూర్తి షెడ్యూల్ ఇదే
AP PG Entrance Exam 2026 : ఏపీ పీజీ సెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి. మే 8 నుండి 11 వరకు మూడు సెషన్లలో ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి.
AP PG Entrance Exam Updates : రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పీజీ సెట్ (APPGCET-2026) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

మే 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఏపీ పీజీసెట్ పరీక్షలు జరుగుతాయి. అయితే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రతి రోజూ మూడు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు తమ సబ్జెక్టు కోడ్ మరియు కేటాయించిన సమయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులు సూచించారు.
మే 08, 2026 (శుక్రవారం):
- ఈరోజు కేవలం సాయంత్రం సెషన్‌లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం (SEC-3): సైకాలజీ (313).
మే 09, 2026 (శనివారం):
- ఉదయం (SEC-1): కామర్స్ (201), ఎడ్యుకేషన్ (202), కెమికల్ సైన్సెస్ (310).
- మధ్యాహ్నం (SEC-2): జనరల్ (102), హిందీ (106), ఉర్దూ (107), బోటనీ (303), మ్యాథమెటికల్ సైన్సెస్ (306).
- సాయంత్రం (SEC-3): హిస్టరీ (114), లైఫ్ సైన్సెస్ (301), స్టాటిస్టిక్స్ (307).
మే 10, 2026 (ఆదివారం):
- ఉదయం (SEC-1): హ్యుమానిటీస్ & సోషల్ సైన్సెస్ (111), కంప్యూటర్ సైన్స్ (314).
- మధ్యాహ్నం (SEC-2): జాగ్రఫీ (315), పొలిటికల్ సైన్స్ (115).
- సాయంత్రం (SEC-3): ఎలక్ట్రానిక్స్ (309), ఎకనామిక్స్ (116).
మే 11, 2026 (సోమవారం):
- ఉదయం (SEC-1): జువాలజీ (305), ఇంగ్లీష్ (101), సంస్కృతం (105), తమిళం (108).
- మధ్యాహ్నం (SEC-2): పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (113), ఫిజికల్ ఎడ్యుకేషన్ (203), సెరికల్చర్ (304).
- సాయంత్రం (SEC-3): జియాలజీ (312), తెలుగు (103), ఎం.ఎఫ్.ఏ (110), ఎఫ్.ఎన్.ఎస్ (302), ఫిజికల్ సైన్సెస్ (308).
ఏపీ పీజీసెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ ఇలా:
- ముందుగా cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
- హోమ్ పేజీలో కనిపిస్తున్న 'APPGCET-2026' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- 'Download Hall Ticket' అనే లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ మరియు అర్హత పరీక్ష హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- సబ్మిట్ బటన్ నొక్కితే మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- దీనిని డౌన్‌లోడ్ చేసుకుని… ప్రింట్ అవుట్ తీసుకోండి.
అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు తమ ఆధార్ కార్డ్ లేదా ఏదైనా గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్‌పై ఉన్న ఫోటో, సంతకం సరిగా ఉన్నాయో లేదో ముందే చూసుకోవాలి. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సహాయ కేంద్రానికి (helpdeskappgcet2026@apsche.org) ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

