ఆరు కంపెనీలకు ఆమోదం, పెట్టుబడులకు పోర్టల్.. ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
ఆరు కంపెనీలకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎస్‌ఐపీబీ) ఆమోదం చెప్పింది. పెట్టుబడులకు పోర్టల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 13వ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 26 కంపెనీలకు చెందిన రూ.20 వేల కోట్ల మేర పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చ జరిగింది. ఎనర్జీ, ఐటీ, ఐ అండ్ ఐ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి.నారాయణ, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఏపీ ప్రభుత్వం ఇటీవల సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 50 శాతానికి పైగా ఆమోద ప్రక్రియలోకి వచ్చాయని, 45 రోజుల్లోగా వీటికి శంకుస్థాపన జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 20,444 కోట్ల విలువైన పెట్టుబడులకు 13వ ఎస్ఐపీబీ ఆమోదం తెలపగా.. దీని ద్వారా 56,278 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇటీవలి కాలంలో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న ఆరు కంపెనీలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. పెట్టుబడుల కోసం పోర్టల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని చూసే ప్రముఖ సంస్థలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తున్నాయి. కంపెనీలు స్థాపించేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. కంపెనీలకు నీరు, విద్యుత్, భూమి వంటి సౌకర్యాలను కల్పిస్తున్నాం. పారదర్శకంగా ఉండటం కారణంగానే ఏపీకి ప్రాజెక్టులు వస్తున్నాయి. గత పాలకులు తెచ్చిన బ్యాడ్ ఇమేజ్‌ని చెరిపేసి ఏపీకీ బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చాం.' అని చంద్రబాబు అన్నారు.
విశాఖ పరిధిలో రూ.1.69 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రక్రియ మెుదలైందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. అమరావతి పరిధిలో రూ.87 వేల కోట్లు, తిరుపతి పరిధిలో రూ.73 వేల కోట్ల పెట్టుబడులు ప్రక్రియ మెుదలైందన్నారు. తాజా సమావేశాల్లో రూ.8.29 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపిందన్నారు. రూ.13.25 లక్షల కోట్లకు సంబంధించి.. ఎంవోయులు జరిగాయని, పెట్టుబడుల ద్వారా రూ.16.13 లక్షల మందికి ఉపాధి కలగనుందన్నారు.
'ఈ ఎంవోయులు అన్నింటికీ ఏయే జిల్లాల్లో ఏర్పాటు చేయాలి. ఎక్కడ భూములు ఇవ్వాలి అనే అంశాలపై నిర్ణయాలు జరిగాయి. 45 రోజుల్లోగా ఎంవోయూలు అన్నింటినీ గ్రౌండింగ్ అయ్యేలా చూడాలి. వీలైనన్ని ఎంవోయూలను గ్రౌండింగ్ చేసి.. దావోస్ సదస్సకు వెళ్తే.. మరిన్ని పెట్టుబడులు వస్తాయి. దావోస్ పర్యటనకంటే ముందే.. 75 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన జరిగేలా సీఎం దృష్టి పెట్టమన్నారు.' అని మంత్రి టీజీ భరత్ తెలిపారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


