...
...
Next Story

APPSC Jobs : డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ.. సర్టిఫికేట్ వెరిఫికేషన్, సీపీటీ తేదీ!

ఆంధ్రప్రదేశ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ధృవపత్రాల పరిశీలనకు తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితా, వెరిఫికేషన్ తేదీని ప్రకటించింది.

Updated on: Jul 2, 2026, 08:23:54 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ పోస్టులకు సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలనకు తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఏపీపీఎస్సీ(ప్రతీకాత్మక చిత్రం)
ఏపీపీఎస్సీ(ప్రతీకాత్మక చిత్రం)

గత ఏడాది (2025) జూలై 15 నుండి జూలై 23 వరకు ఆన్‌లైన్ విధానంలో (CBT) నిర్వహించిన రాత పరీక్షల మార్కుల ఆధారంగా ఈ మెరిట్ జాబితాను రూపొందించారు. రాత పరీక్షలో అర్హత సాధించి, తదుపరి దశకు ఎంపికైన అభ్యర్థులకు జూలై 6, 2026 ఉదయం 10:00 గంటలకు విజయవాడలోని ఏపీపీఎస్‌సీ ప్రధాన కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.

అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే అదే రోజున అభ్యర్థులకు తప్పనిసరి అయిన కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ కూడా నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రం, స్థానికత సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, హాల్ టికెట్లతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లను, రెండు సెట్ల జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థుల పూర్తి జాబితా, కాల్ లెటర్స్, ఇతర అప్‌డేట్ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.inను సందర్శించవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలేజియేట్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న అభ్యర్థులకు ఈ కంప్యూటర్ టెస్ట్ (CPT) క్వాలిఫైయింగ్ పరీక్షగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఎలాంటి ఆలస్యం చేయకుండా నిబంధనల ప్రకారం నిర్దేశిత సమయానికి విజయవాడ కార్యాలయానికి చేరుకోవాలని కమిషన్ కోరింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe