AP University Recruitment : అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల అప్డేట్ - స్క్రీనింగ్‌ ఎగ్జామ్ వాయిదా, కొత్త తేదీలివే

విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఆర్జీయూకేటీ లెక్చరర్ల స్క్రీనింగ్ పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. డిసెంబర్ 20 నుంచి 24 వరకు కొత్త తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది.

Published on: Nov 26, 2026, 13:57:40 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT)లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న స్క్రీనింగ్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసింది. పరిపాలనాపరమైన కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ పేర్కొంది.

అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆర్జీయూకేటీ పరీక్షలు వాయిదా
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆర్జీయూకేటీ పరీక్షలు వాయిదా

కొత్త షెడ్యూల్ ఇదే….

తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 1 నుంచి 5 వరకు (డిసెంబర్ 2 మినహా), అలాగే డిసెంబర్ 9న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో స్క్రీనింగ్/రాత పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ తేదీలను మార్చి…. ఇప్పుడు డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 24, 2026 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది.

అధ్యాపక కొలువుల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు, పీహెచ్‌డీ, నెట్/సెట్ పూర్తి చేసిన ఆశావహులు ఈ మార్పులను గమనించాలని ఏపీపీఎస్సీ తెలిపింది. పరీక్ష తేదీలు మారిన నేపథ్యంలో అభ్యర్థులు తమ ప్రిపరేషన్ ప్రణాళికను కొత్త షెడ్యూల్‌కు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే అవకాశం లభించిందని నిపుణులు చెబుతున్నారు.

త్వరలో సబ్జెక్టుల వారీగా వివరాలు…

పరీక్షలను ఏయే రోజుల్లో, ఏయే సబ్జెక్టులకు నిర్వహిస్తారనే విషయంపై సబ్జెక్టుల వారీగా సమగ్ర షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. తాజా అప్‌డేట్లు, పరీక్షకు సంబంధించిన ఇతర సమాచారం కోసం అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ http://psc.ap.gov.in ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని అధికారులు సూచించారు.

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.