ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు చేపట్టింది. గత నెల 15వ తేదీన 254 పోస్టుల భర్తీ కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేయగా… తాజాగా పూర్తిస్థాయి నోటిఫికేషన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
వేర్వురు నోటిఫికేషన్లు - ఖాళీల వివరాలు..

ఈ ప్రకటన ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అనలిస్ట్ గ్రేడ్-2తో పాటు అసెంబ్లీ రిపోర్టర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు, కేటగిరీల వారీగా కేటాయింపులు, వేతన శ్రేణి, వయోపరిమితి మరియు విద్యా అర్హతల వంటి పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://portal-psc.ap.gov.in/ లో పొందుపరిచారు.
- అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్: 196 పోస్టులు
- అసిస్టెంట్ డైరెక్టర్ (ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్): 17 పోస్టులు
- అనలిస్ట్ గ్రేడ్-2 (కాలుష్య నియంత్రణ మండలి): 18 పోస్టులు
- ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్: 12 పోస్టులు
- ఆంగ్ల భాష రిపోర్టర్లు (అసెంబ్లీ): 10 పోస్టులు
- తెలుగు భాష రిపోర్టర్ (అసెంబ్లీ): 01 పోస్టు
నేటి నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు…
అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబరు 13, 2026 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పణకు నవంబరు 02, 2026 రాత్రి 11:59 గంటల వరకు గడువు నిర్ణయించారు. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, నిబంధనలను పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఓ ప్రకటనలో సూచించారు.
మరోవైపు 166 గ్రూప్-1 ఖాళీల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల కొనసాగుతోంది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 27, 2026 రాత్రి 11:59 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
{{/usCountry}}మరోవైపు 166 గ్రూప్-1 ఖాళీల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల కొనసాగుతోంది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 27, 2026 రాత్రి 11:59 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
{{/usCountry}}ఆసక్తి గల అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక పోర్టల్ ( https://portal-psc.ap.gov.in/ లేదా https://psc.ap.gov.in ) ద్వారా ఓటీపీఆర్ (OTPR) నమోదు చేసుకుని, దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ సమగ్ర వివరాలను కూడా కమిషన్ వెబ్‌సైట్‌లోనే అందుబాటులో ఉంచారు.
గ్రూప్-1 పరిధిలోని అత్యధిక పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అయితే సాంకేతిక నైపుణ్యం అవసరమైన డీఎస్పీ కమ్యూనికేషన్స్ పోస్టుకు మాత్రం ఇంజినీరింగ్ విభాగంలో (ఈసీఈ, టెలికమ్యూనికేషన్స్ మొదలైనవి) సంబంధిత డిగ్రీ తప్పనిసరి చేశారు.