APPSC FRO Recruitment : ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల - ఈనెల 16 నుంచి దరఖాస్తులు

APPSC Forest Range Officer Recruitment : ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సర్వీస్‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 16 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. 

Published on: Oct 5, 2026, 06:59:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

APPSC Forest Range Officer Notification : నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు అందించింది. ఏపీ ఫారెస్ట్ సర్వీస్‌లో జనరల్ రిక్రూట్‌మెంట్ కింద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఏపీపీఎస్సీ
ఏపీపీఎస్సీ

ఖాళీల వివరాలు..?

ఈ ప్రకటన ద్వారా మొత్తం 4 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,440 నుంచి రూ.1,37,220 పరిధిలో వేతన స్కేలు అమలులో ఉంటుంది.

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి క్రింది విభాగాలలో ఏదో ఒక దానిలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు.

  • అగ్రికల్చర్, వృక్షశాస్త్రం, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ / కంప్యూటర్ సైన్స్
  • ఇంజినీరింగ్ (అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్)
  • ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్
  • మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ

అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: అక్టోబర్ 16, 2026
  • దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: నవంబర్ 5, 2026 (రాత్రి 11:59 గంటల వరకు)
  • అధికారిక వెబ్ సైట్ - https://portal-psc.ap.gov.in/

ఈ ఉద్యోగాల ఎంపిక కోసం ఎటువంటి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించరు. నేరుగా ఒకే దశలో ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మొత్తం 600 మార్కులకు గాను ప్రశ్నలు ఉంటాయి.

  • క్వాలిఫైయింగ్ టెస్ట్ (100 మార్కులు) : జనరల్ ఇంగ్లీష్ (50 మార్కులు), జనరల్ తెలుగు (50 మార్కులు)
  • పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (150 మార్కులు)
  • పేపర్-2: మ్యాథమెటిక్స్ (SSC స్టాండర్డ్ - 150 మార్కులు)
  • పేపర్-3: జనరల్ ఫారెస్ట్రీ - I (150 మార్కులు)
  • పేపర్-4: జనరల్ ఫారెస్ట్రీ - II (150 మార్కులు)

రాత పరీక్షలో ప్రతీ తప్పు సమాధానానికి 1/3 వంతు నెగెటివ్ మార్కింగ్ వర్తిస్తుంది. మెరిట్ ఆధారంగా 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More