APPSC OTPR New Registration : ఏపీపీఎస్సీ ఓటీపీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ గైడ్

APPSC OTPR New Registration : ఏపీపీఎస్సీ ఓటీపీఆర్ అప్డేట్ కోసం సెప్టెంబర్ 30 నుంచి విండో ఓపెన్ చేసింది. న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకునేవారి కోసం స్టెప్ బై స్టెప్ గైడ్ ఇక్కడ ఉంది.

Updated on: Sep 30, 2026, 19:37:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ద్వారా విడుదలయ్యే ఉద్యోగ ప్రకటనలకు దరఖాస్తు చేసుకోవడానికి వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) తప్పనిసరి. అభ్యర్థులు తమ వ్యక్తిగత, విద్యా అర్హతల వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేందుకు APPSC అధికారిక యూజర్ గైడ్‌‌ను అందుబాటులో ఉంచింది. కొత్తగా నమోదు చేసుకునే అభ్యర్థుల కోసం సులభమైన పద్ధతిలో ఓటీపీఆర్ ప్రాసెస్ వివరాలు మీకోసం అందిస్తున్నాం.

ఏపీపీఎస్సీ ఓటీపీఆర్ కొత్త రిజిస్ట్రేషన్
ఏపీపీఎస్సీ ఓటీపీఆర్ కొత్త రిజిస్ట్రేషన్

న్యూ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి?

ముందుగా APPSC అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో కనిపిస్తున్న One Time Profile Registration ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

మీరు నేరుగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తుంటే Direct Recruitment కేటగిరీ కింద ఉన్న ‘New Registration’ లింక్‌పై క్లిక్ చేయాలి. (ప్రభుత్వ ఉద్యోగులు/డిపార్ట్‌మెంటల్ టెస్ట్‌లు రాసేవారు వాటికి సంబంధించిన ప్రత్యేక న్యూ రిజిస్ట్రేషన్ లింక్‌ను ఎంచుకోవాలి).

న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్‌లో అడిగిన అన్ని వివరాలను కచ్చితత్వంతో భర్తీ చేయాలి. (పేరు, లింగం, పుట్టిన తేదీ, తండ్రి పేరు, తల్లి పేరు, మాతృభాష, కులం, మతం, గుర్తింపు గుర్తులు. ఇతర వివరాలు: దివ్యాంగులా (SADAREM), ఎక్స్-సర్వీస్‌‌మెన్, లేదా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన సమాచారం. చిరునామా వివరాలు: ప్రస్తుత మరియు శాశ్వత చిరునామా.)

విద్యా అర్హతలు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న రకం (రెగ్యులర్/ప్రైవేట్/ఓపెన్ స్కూలింగ్) వివరాలు నమోదు చేయాలి. అలాగే 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ తదితర వివరాల హాల్ టికెట్ నంబర్లు, మార్కుల శాతం, పాసైన సంవత్సరం భర్తీ చేయాలి.

స్పష్టమైన పాస్‌పోర్ట్ సైజు ఫోటో (గరిష్టంగా 50 KB, JPEG), సంతకం (గరిష్టంగా 30 KB, JPEG) నిర్దేశిత పరిమాణంలో అప్‌లోడ్ చేయాలి.

మొత్తం పూర్తి చేసిన తర్వాత డిక్లరేషన్ అంగీకరించి ‘Preview’ బటన్‌పై క్లిక్ చేయాలి. వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకున్న తర్వాత, స్క్రీన్‌పై కనిపిస్తున్న క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి ‘Submit’ పై క్లిక్ చేయాలి. సబ్మిట్ చేయగానే మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీకి ప్రత్యేకమైన OTPR రెఫరెన్స్ ఐడీ వస్తుంది.

భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు రసీదును ‘Download Receipt’ లేదా ‘Print’ ఆప్షన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రెఫరెన్స్ ఐడీ వచ్చిన తర్వాత APPSC హోమ్ పేజీకి వెళ్లి ‘Login’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కొత్త వినియోగదారులు ‘Sign Up’ పై క్లిక్ చేసి తమ OTPR ID, మొబైల్ నంబర్ నమోదు చేసి ‘Get OTP’ క్లిక్ చేయాలి. మొబైల్‌‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ‘Validate OTP’ క్లిక్ చేయాలి.

కొత్త పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాలి. పాస్‌వర్డ్‌‌లో కనీసం ఒక క్యాపిటల్ లెటర్, ఒక సంఖ్య, ఒక ప్రత్యేక గుర్తు ఉండాలి.

తప్పుగా నమోదు చేసిన వివరాలను సవరించుకోవడానికి APPSC వెబ్‌సైట్‌లో ‘Modify One Time Profile Registration’ సదుపాయం కూడా ఉంది. దీని ద్వారా మీరు వ్యక్తిగత వివరాలు, ఫోటో/సంతకం లేదా ఇతర వివరాలు (చిరునామా, విద్యా అర్హతలు) లోగిన్ అయి సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More