APPSC OTPR Update : నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ అలర్ట్.. సెప్టెంబర్ 30 నుంచి ఓటీపీఆర్ అప్డేట్

APPSC OTPR Update : నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ కీలక సూచన చేసింది. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అభ్యర్థులు ఓటీపీఆర్ అప్డేట్ చేసుకోవాలని ప్రకటన విడుదల చేసింది.

Published on: Sep 29, 2026, 20:29:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) నిరుద్యోగులకు అత్యంత ముఖ్యమైన సూచన చేసింది. రాష్ట్రంలో లోకల్ కేడర్ (ఆయా జిల్లాల స్థానికత) నిర్ధారణకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నిబంధనల దృష్ట్యా, అభ్యర్థులందరూ తమ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్(OTPR) వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని వెల్లడించింది.

ఏపీపీఎస్సీ ఓటీఆర్ అప్డేట్
ఏపీపీఎస్సీ ఓటీఆర్ అప్డేట్

ఈ అప్‌డేట్ ప్రక్రియ సెప్టెంబర్ 30, 2026 నుంచే ప్రారంభమవుతుందని ఏపీపీఎస్సీ అధికారిక ప్రకటనలో తెలిపింది. కమిషన్ విడుదల ప్రకారం.. అభ్యర్థుల చదువు, నివాస వివరాల ఆధారంగా జిల్లా, జోన్, మల్టీ-జోన్ వివరాలకు సంబంధించిన మార్పులను ఓటీపీఆర్ వ్యవస్థలో పొందుపరిచారు.

ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 కింద, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఏప్రిల్ 20, 2026న జారీ చేసిన G.O.Ms.No.45లోని పేరా 7 నిబంధనలకు అనుగుణంగా ఈ ఓటీపీఆర్ వ్యవస్థను అప్‌డేట్ చేశారు. కొత్త నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే ముందు ప్రతీ అభ్యర్థి తమ ప్రొఫైల్‌ను సరిచూసుకోవాల్సి ఉంటుంది.

మున్ముందు ఏపీపీఎస్సీ విడుదల చేయబోయే ఏ ఉద్యోగ నోటిఫికేషన్‌కైనా అప్లై చేసే కంటే ముందే అభ్యర్థులు తమ ఓటీపీఆర్ వివరాలను నవీకరించుకోవాలని కమిషన్ ఆదేశించింది. అభ్యర్థులు నమోదు చేసే ప్రతి సమాచారం (విద్యార్హతలు, స్థానికత, జిల్లా వివరాలు) నిబంధనలకు కట్టుబడి, అత్యంత కచ్చితత్వంతో ఉండాలని స్పష్టం చేసింది.

ఓటీపీఆర్ ద్వారా సేకరించిన వివరాలను నియామక ప్రక్రియలోని సర్టిఫికెట్ల పరిశీలన దశలో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. స్థానికత లేదా ఇతర అర్హతలకు సంబంధించి తప్పు సమాచారం ఇచ్చినా, అసత్య ప్రకటనలు చేసినా అభ్యర్థిత్వాన్ని తక్షణమే రద్దు చేస్తామని ఏపీపీఎస్సీ తీవ్రంగా హెచ్చరించింది.

OTPR వివరాలను అప్‌డేట్ చేసుకోవడం ఎలా?

అభ్యర్థులు నేరుగా కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా తమ ప్రొఫైల్ అప్‌డేట్ చేసుకోవచ్చు:

మొదట ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in ను సందర్శించాలి.

హోమ్‌పేజీలో ఉన్న One Time Profile Registration లింక్‌పై క్లిక్ చేయాలి.

మీ జిల్లా, జోన్, చదువుకున్న వివరాలను సరిగ్గా నమోదు చేసి సబ్‌మిట్ చేయాలి.

రాబోయే రోజుల్లో ఏపీపీఎస్సీ వరుస నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంది. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా దరఖాస్తుదారులు వీలైనంత త్వరగా తమ ఓటీపీఆర్ ప్రొఫైల్‌ను సరిచేసుకోవాలని ఏపీపీఎస్సీ అధికారులు చెబుతున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More