GATE 2027 Registration : గేట్ 2027 దరఖాస్తు గడువు పొడిగింపు - ఇలా అప్లయ్ చేసుకోండి

GATE 2027 Registration : గేట్ 2027 పరీక్ష రాసే అభ్యర్థులకు మద్రాస్ ఐఐటీ మరో అప్డేట్ ఇచ్చింది. ఆన్‌లైన్ దరఖాస్తు గడువును అక్టోబర్ 5, 2026 వరకు పొడిగిస్తూ ప్రకటన చేసింది. 

Published on: Sep 29, 2026, 08:21:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

GATE 2027 Registration : దేశంలోని అత్యున్నత సాంకేతిక విద్యా సంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) 2027 దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి ఐఐటీ మద్రాస్ (చెన్నై) కీలక ప్రకటన చేసింది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు మరొక అవకాశం కల్పిస్తూ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు తేదీని పొడిగించింది.

గేట్ 2027 దరఖాస్తు గడువు పొడిగింపు
గేట్ 2027 దరఖాస్తు గడువు పొడిగింపు

అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ gate2027.iitm.ac.in ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, సమర్పించిన దరఖాస్తుల్లో సవరణలు చేసుకునేందుకు 'అప్లికేషన్ కరెక్షన్ విండో'ను అక్టోబర్ 14న అందుబాటులోకి వస్తుంది. ఈ సవరణల ప్రక్రియ అక్టోబర్ 21, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రాల (పరీక్షా నగరం) వివరాలను 2027 జనవరి 4న అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు.

ఎవరెవరు అర్హులు….?

  • ప్రస్తుతం ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ లేదా హ్యుమానిటీస్ కోర్సుల్లో డిగ్రీ (అండర్ గ్రాడ్యుయేషన్) మూడో సంవత్సరం లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు.
  • కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి పైన పేర్కొన్న విభాగాల్లో ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • విదేశాల్లో డిగ్రీ పూర్తి చేసినవారు లేదా ప్రస్తుతం చివరి సంవత్సరాల్లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులు కూడా కనీసం మూడేళ్ల వ్యవధి గల బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో గేట్‌కు అప్లై చేయవచ్చు.

సాధారణ వ్యవధిలో మహిళలు, ఎస్సీ , ఎస్టీ , దివ్యాంగుల కేటగిరీల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.1000గా నిర్ణయించారు. గడువు ముగిసిన తర్వాత 'లేట్ ఫీజు' వ్యవధిలో వీరు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర అభ్యర్థులందరికీ సాధారణ రుసుము రూ.2000 కాగా, లేట్ ఫీజుతో కూడిన పొడిగించిన కాలంలో ఇది రూ.2500గా ఉంటుంది. ఫీజు చెల్లింపులన్నీ ఆన్‌లైన్ విధానంలోనే జరపాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

పరీక్ష తేదీలు

ఐఐటీ మద్రాస్ గేట్ 2027 పరీక్షలను 2027 ఫిబ్రవరి 6, 7, 13, 14, 20 మరియు 21 తేదీల్లో నిర్వహిస్తుంది. ఆరు రోజుల పాటు సాగే ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలను రోజుకు రెండు విడతల్లో (ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో) నిర్వహిస్తారు. మొత్తం 30 విభిన్న పేపర్లలో ఈ పరీక్ష అందుబాటులో ఉంటుంది. ఒక అభ్యర్థి గరిష్టంగా ఒకటి లేదా విధివిధానాలకు లోబడి రెండు పేపర్లలో పరీక్ష రాయడానికి మాత్రమే అర్హత కలిగి ఉంటారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం:

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ gate2027.iitm.ac.in ను సందర్శించండి.
  • హోమ్‌పేజీలో కనిపించే 'IIT GATE 2027 Registration' లింక్‌పై క్లిక్ చేయండి.
  • కొత్త విండో ఓపెన్ అయిన తర్వాత మీ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
  • లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అయి దరఖాస్తు ఫారాన్ని పూర్తిగా నింపండి.
  • నిర్దేశిత ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు రుసుమును సజావుగా చెల్లించండి.
  • సబ్‌మిట్ బటన్ నొక్కిన తర్వాత పూర్తి చేసిన అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.
  • భవిష్యత్ అవసరాల కోసం ఆ ప్రతినొకదాన్ని ప్రింట్ తీసి భద్రపరుచుకోండి.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More