...
...
Next Story

ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్.. సూపర్‌వైజర్ గ్రేడ్ - 1 పోస్టులకు దరఖాస్తులు

ఏపీ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ సబార్డినేట్ సర్వీస్‌ పరిధిలోని సూపర్‌వైజర్ గ్రేడ్ - 1 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

Published on: Oct 21, 2026, 16:25:51 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) శుభవార్త అందించింది. ఏపీ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ సబార్డినేట్ సర్వీస్‌ పరిధిలోని సూపర్‌వైజర్ గ్రేడ్ - 1 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఉద్యోగానికి సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, జీతం, పరీక్షా విధానం వంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మొత్తం 31 ఖాళీలు ఉన్నాయి. జీతం రూ.37,640 నుంచి రూ. 1,15,500 వరకు ఉంటుంది. అప్లికేషన్ అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రారంభమైంది. నవంబర్ 5 (రాత్రి 11:59 గంటల వరకు) దాకా చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in‌లో అప్లై చేయాలి.

అభ్యర్థులు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి హోమ్ సైన్స్, సోషల్ వర్క్‌లో డిగ్రీ కలిగి ఉండాలి. లేదా సోషియాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, క్లినికల్ న్యూట్రిషన్, అప్లైడ్ న్యూట్రిషన్ లేదా ఫుడ్ టెక్నాలజీ వంటి అనుబంధ విభాగాల్లో బి.ఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. హోమ్ సైన్స్, సోషల్ వర్క్, సోషియాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్‌లలో ఉన్నత విద్య అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: 01.07.2026 నాటికి కనిష్టంగా 18 ఏళ్లు, గరిష్టంగా 44 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు మినహాయింపు ఉంటుంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు/ఎక్స్-సర్వీస్‌మెన్ నిబంధనల ప్రకారం మినహాయింపు ఉంటుంది.

సూపర్‌వైజర్ గ్రేడ్ - 1 పోస్టుల ఎంపిక ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. అనంతరం అభ్యర్థులు కంపాజిట్ కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks