Warangal Faculty Recruitment 2026 : నిట్ వరంగల్‌లో 34 ఉద్యోగ ఖాళీలు - దరఖాస్తు తేదీలు, నోటిఫికేషన్ వివరాలివే

NIT Warangal Faculty Recruitment 2026 : వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 34 ఫ్యాకల్టీ పోస్టులున్నాయి.

Published on: Oct 16, 2026, 18:19:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

NIT Warangal Faculty Recruitment 2026 : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ ఉద్యోగాలున్నాయి.

NIT వరంగల్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
NIT వరంగల్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

మొత్తం 34 ఖాళీలు….

ఎన్ఐటీ వరంగల్ ప్రకటన ప్రకారం మొత్తం 34 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి….

• ప్రొఫెసర్ (Pay Level 14A ): 01 పోస్టు (అన్‌రిజర్వ్‌డ్)

• అసోసియేట్ ప్రొఫెసర్ (Pay Level 13A 2): 03 పోస్టులు (అన్‌రిజర్వ్‌డ్)

• అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I (Pay Level 12 ): 06 పోస్టులు

• అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II (Pay Level 10) : 24 పోస్టులు

బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మ్యాథమెటిక్స్, మెకానికల్, మేనేజ్‌మెంట్ స్టడీస్, ఫిజిక్స్, ఎడ్యుకేషన్ తదితర విభాగాలు/శాఖలలో ఈ ఖాళీలు ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అత్యుత్తమ పరిశోధనా పత్రాలు, ప్రాజెక్టులు ఉన్న అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్టంగా 60 ఏళ్ల వరకు సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం…

అభ్యర్థులు సమర్పించిన ఆన్‌లైన్ దరఖాస్తులు, రీసెర్చ్ క్రెడిట్ పాయింట్లు, నిబంధనల ఆధారంగా స్క్రూటినీ చేసి షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ప్రెజెంటేషన్/సెమినార్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక ప్రక్రియ చేపడతారు.

• జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు : రూ. 2000

• ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు అభ్యర్థులకు : రూ. 1000

• అభ్యర్థులు NIT వరంగల్ అధికారిక వెబ్‌సైట్ https://nitw.ac.in/Careers/ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

• ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ : 30 నవంబరు 2026 (రాత్రి 11:59 గంటల వరకు)

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More